Ad Code

ట్విట్టర్ లో ఆర్టికల్ ఫీచర్ !


తంలో ట్వీట్ చేయాలంటే అక్షరాలకు పరిమితి ఉండేది. గతంలో 140 అక్షరాలు రాసే వీలుండగా 2018లో 280కి పెంచింది. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ ఆర్టికల్ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ తో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలు రాయచ్చు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఈ ఫీచర్ తో అక్షరాల పరిమితికి చెక్కు పడినట్లే. ఇక ట్వీట్ల రూపంలో ఏదైనా చెప్పాలంటే 10 ట్వీట్లు చేయాల్సిన అవసరం లేదు. ఓ చిన్న పుస్తకమే రాయవచ్చు. కంటెంట్ యూజర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. అలాగే ఎలన్ మాస్క్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొన్ని ఫీచర్ల వినియోగంపై పరిమితులు విధించాడు. గతంలో ట్వీట్లు చూడటంపై ఎటువంటి పరిమితి ఉండేది కాదు. అలాగే లాగిన్ అయితే మాత్రమే ఇతర ట్వీట్లు చూసే అవకాశం ఉంది. దీనికి తోడు బ్లూ టిక్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే పదివేల అక్షరాలు రాసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ట్వీట్లు చూసుకునే వెసులుబాటు లభించింది. దీంతో చాలా మంది మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే అది అంతగా ఆకట్టుకోలేకపోతుంది. మరీ ఇప్పుడు తీసుకు వచ్చే ఫీచర్ కేవలం బ్లూటిక్ యూజర్లకా లేక అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu