Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, August 28, 2023

త్వరలో చంద్రుడి అద్భుత చిత్రాల విడుదల !


చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. అవి తమ కంప్యూటర్‌ సెంటర్కు వెళ్తున్నాయని, అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే వాటిని విడుదల చేస్తామన్నారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని సోమనాథ్ చెప్పారు. వచ్చే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తి చేస్తాయన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు శివ్‌శక్తి అనే పేరును ప్రధాని మోడీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. అంతేకాకుండా చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. విక్రమ్ ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంతో పాటు కాస్త లోతులో సేకరించిన శాంపిల్స్ పిల్ ఉష్ణోగ్రతల లెక్కలను గ్రాఫ్ రూపంలో తెలిపింది. దీనికున్న పది సెన్సర్ల సాయంతో.. చంద్రుడి నేలపై దాదాపు 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, టెంపరేచర్ లను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్ కు ఉంది.


No comments:

Post a Comment

Popular Posts