Ad Code

ఐఎస్ఎస్ కు నాసా నుంచి రాకెట్ !


మెరికా అంతరిక్ష కేంద్రం నాసా నుంచి నలుగురు ఆస్ట్రోనాట్స్ బయలుదేరారు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ లో వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు భూ కక్ష్యలో తిరుగుతున్న ఐఎస్ఎస్ కు వాళ్ళు వెళుతున్నారు. నాసా నుంచి వెళ్ళిన స్పేస్ ఎక్స్ రాకెట్ లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వీళ్ళు నలుగురు నాలుగు దేశాల నుంచి వచ్చారు. ఇలా నాలుగు దేశాలకు చెందిన వాళ్ళను స్పేస్ లోకి పంపించడం అమెరికాకు ఇదే మొదటిసారి. డెన్మార్క్, జపాన్, అమెరికా, రష్యాలకు చెందిన ఈ నలుగురు వ్యోమగాములు ఆరు నెలల పాటూ ఐఎస్ఎస్ లో విధులు నిర్వహించనున్నారు. ఇంతకు ముందు ఉన్నవారి ప్లేస్ లో వీళ్ళు వెళుతున్నారు. నాసాకు చెందిన జాస్మిన్ మోఘ్ బెలి ఈ మిషన్ కు కమాండర్ గా ఉన్నారు. ఈమె ఇరానియన్. పుట్టింది జర్మనీలో అయినా పెరిగింది మాత్రం న్యూయార్క్ లో. మెరైన్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్న జాస్మిన్ మొదటిసారి అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఇరాన్ అమ్మాయిలే ఏదైనా సాధిస్తారని తాను నిరూపిస్తున్నాని జాస్మిన్ గర్వంగా చెబుతున్నారు. ఇక డెన్మార్క్ నుంచి ఆండ్రియాస్ మొగెన్సెన్, జపాన్ నుంచి సతోషి పురుకావా, రష్యాకు చెందిన కాన్ స్టాంటిన్ బొరిసోవ్ లు మిగతా వారు.

Post a Comment

0 Comments

Close Menu