Ad Code

నెట్ ఫ్లిక్స్ గేమింగ్ సాఫ్ట్ వేర్ !


నెట్ ఫ్లిక్స్ గేమ్స్ ను అధికంగా ఇష్టపడే వారినే టార్గెట్ చేస్తూ గేమింగ్ సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసింది. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే వినియోగదారులకు యాడ్ ఫ్రీ గేమ్ లను ఆండ్రాయిడ్, ఐఓఎస్ లపై పనిచేసే ఫోన్లు, ట్యాబ్లెట్లలో డౌన్ లోడ్ చేసుకొనే వెసులబాటును కల్పించింది. గతంలో నే ఆ సంస్థ అన్ని డివైజ్లలో కూడా గేమ్ లను ఆడుకునే కొత్త విధానాన్ని త్వరలో తీసుకొస్తామని ప్రకటించింది. దానిని ఇప్పుడు నిజం చేస్తూ కొత్త సాఫ్ట్ వేర్ ను తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ గేమ్ కంట్రోలర్ యాప్ పేరుతో టీవీలో గేమ్స్ ఆడుకునే విధంగా కొత్త సాఫ్ట్ వేర్ ను ఆవిష్కరించింది. నెట్ ఫ్లిక్స్ గేమ్ కంట్రోలర్ యాప్ ప్రస్తుతానికి ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. యాపిల్ యాప్ స్టోర్ లో ఐఫోన్లు, ఐ ప్యాడ్ల కస్టమర్లు ఈ గేమ్ కంట్రోలర్ యాప్ ను ఉచితంగానే డైన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెట్ ఫ్లిక్స్ గేమ్ కంట్రోలర్ సాఫ్ట్ వేర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే టీవీలో గేమ్స్ ఆడుకునేందుకు వినియోగించే ఓ జాయ్ స్టిక్ అని చెప్పొచ్చు. ఈ యాప్ ను ఐఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని నెట్ ఫ్లిక్స్ గేమ్స్ ను ఉచితంగా ఆడుకోవచ్చు. మొబైల్ ను టీవీ కనెక్ట్ చేసి, టీవీలోనే పెద్ద స్క్రీన్ పై గేమ్స్ ఆడుకోవచ్చు. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ 2021 నుంచే క్లౌడ్ గేమింగ్ సర్వీస్ లను అందిస్తోంది. వీటిల్లో అధిక గేమ్స్ లో ఎండ్ సాఫ్ట్ వేర్ లతో తయారయ్యే ఫోన్ల కోసం తయారు చేసినవే. నెట్ ఫ్లిక్స్ తన కంటెంట్ ను అధిక సంఖ్యలో వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి చర్యలను తీసుకుంటుంది. అదే విధంగా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త నెట్ ఫ్లిక్స్ గేమ్ కంట్రోలర్ సాఫ్ట్ వేర్ కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే సాధారణ నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ మాత్రం వినియోగదారులు కలిగి ఉండాలి. నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న ఎవరైనా ఈ యాప్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. టీవీ తెరపై గేమ్స్ ను ఆడుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu