Ad Code

రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ !


రిలయన్స్ డిజిటల్ అదిరే ఆఫర్లు తీసుకువచ్చింది. మళ్లీ డిజిటల్ ఇండియా సేల్ తీసుకువచ్చింది. అమేజింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ వంటి వాటిపై భారీ ఆఫర్లు పొందొచ్చు. ఆగస్ట్ 15 వరకే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఈ కొత్త సేల్‌లో భాగంగా ఇంకా అదనపు తగ్గింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 5 వేల వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తే రూ. 3 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే 10 శాతం అష్యూర్డ్ డిస్కౌంట్ వోచర్ కూడా లభిస్తుంది. కస్టమర్లు వారి తర్వాతి కొనుగోలుపై ఈ వోచర్ ద్వారా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే కొనుగోలు దారులకు ఇది డబుల్ బొనాంజా అని చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డులపై ఆఫర్లు మాత్రమే కాకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన కూడా డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా వీటికి అదనంగా రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా తీసుకువచ్చింది. ఈ ఆఫర్లు పొందాలని భావించే వారు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి లేదంటే మై జియో స్టోర్‌కు వెళ్లొచ్చు. లేదంటే రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఆఫర్ తర్వాత చూస్తే.. 75 యూహెచ్‌డీ గూగుల్ టీవీ ధర రూ. 69,990 నుంచి ప్రారంభం అవుతోంది. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీ ధర రూ. 99,990 నుంచి స్టార్ట్ అవుతోంది. అలాగే ఎంపిక చేసిన శఆంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీల కొనుగోలుపై ఉచితంగానే సౌండ్ బార్ పొందొచ్చు. దీని ధర రూ. 44,990గా ఉంది. ఇంకా ఒప్పొ రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 4,999 విలువైన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌ను రూ.499కే పొందొచ్చు. యాపిల్ ఐపాడ్స్ విషయానికి వస్తే.. నెలకు రూ. 1167 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌పీ ఎన్వీ క్రియేటర్ ల్యాప్‌టాప్స్ ధర రూ. 57,499 నుంచి ప్రారంభం అవుతోంది. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ ధర రూ. 51,990 నుంచి ఉంది. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2వ జనరేషన్ ధర రూ. 26,990గా ఉంది. అయితే మీరు వీటిని రూ. 23,990కే కొనొచ్చు. యాపిల్ వాచ్ ఎస్8ను రూ. 45,900కు కాకుండా రూ. 33,249కే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu