Ad Code

ఫోన్‌పే కొత్త యాప్ స్టోర్ !



ఫోన్‌పే కొత్త యాప్ స్టోర్ తీసుకువచ్చింది. ఇండస్ యాప్ స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్ లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు ఈ యాప్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని, మేడిన్ ఇండియా యాప్స్‌ను ఇండస్ యాప్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయొచ్చని ఫోన్‌పే  ప్రకటించింది. ఈ యాప్ సేవలు 12 భాష్లలో అందుబాటులో ఉండనున్నాయి. వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే ప్రకారం చూస్తే డెవలపర్లు వారి యాప్స్‌ను ఇండస్ యాప్ స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ చేయొచ్చు.
 తొలి ఏడాది ఉచితంగానే యాప్స్‌ను ఈ ఇండస్ యాప్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంటోంది. రెండో ఏడాది నుంచి స్వల్ప మొత్తంలో వార్షిక ఫీజు ఉంటుందని వెల్లడించింది. అలాగే ఇన్ యాప్ పేమెంట్లకు ప్లాట్‌ఫామ్ ఫీజులు, కమిషన్లు వంటివి ఉండవని వెల్లడించింది. అందువల్ల డెవలపర్లు వారికి నచ్చిన పేమెంట్ గేట్‌వేస్‌ను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇండస్ యాప్ స్టోర్ సీపీవో, కోఫౌండర్ ఆకాశ్ డోంగ్రీ మాట్లాడుతూ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 2026 కల్లా 1 బిలియన్ యూజర్ల స్థాయికి చేరవచ్చని వెల్లడించారు. గూగుల్ ప్లేస్టోర్ వంటి వాటికి ఈ యాప్ స్టోర్ ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపారు. లొకలైజేషన్, యాప్ డిస్కవరీ, కన్సూమర్ ఎంగేజ్‌మెంట్ వంటి వాటి అంశంలో ఈ యాప్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని వివరించారు. ఫోన్‌పే ప్రకారం చూస్తే ఇండస్ యాప్ స్టోర్ డెవలపర్ల ప్లాట్‌ఫామ్ అనేది ఆండ్రాయిడ్ డెవలపర్లకు ప్రత్యామ్నాయ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌గా ఉంటుంది. దీని ద్వారా ఇండియన్ మార్కెట్‌లో వాటా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోన్‌పే లాంచ్ ప్యాడ్ కూడా తీసుకువచ్చింది. స్టార్టప్స్ కోసం దీన్ని ఆవిష్కరించింది. డెవలపర్లు వివిధ రకాల టూల్స్, ఫీచర్ల ద్వారా బెనిఫిట్ పొందొచ్చని, రౌండ్ ద క్లాక్ కస్టమర్ సపోర్ట్ లభిస్తుందని, 12 భారతీయ భాషల్లో సేవలు లభిస్తాయని ఫోన్‌పే పేర్కొంటోంది. యూజర్లు ఈమెయిల్ అకౌంట్ లేకుండానే మొబైల్ నెంబర్ బేస్డ్ లాగిన్ అవ్వొచ్చు. ఇన్ యాప్ పేమెంట్లకు జీరో కమిషన్ బెనిఫిట్ ఉంది. ఇంకా జీరో లిస్టింగ్ ఫీజు తొలి ఏడాదికి వర్తిస్తుంది. ఇంకా ఇండస్ ప్లాట్‌ఫామ్ ద్వారా డెవలపర్లు రియల్ టైమ్ యాప్ విటల్స్ మానిటరింగ్, అనలిటిక్స్, కాంపిటీటర్ అనాలసిస్ వంటి ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu