తాజా సమాచారంతో చాట్‌జీపీటీ సమాధానాలు !
Your Responsive Ads code (Google Ads)

తాజా సమాచారంతో చాట్‌జీపీటీ సమాధానాలు !


ప్రస్తుతం చాట్‌జీపీటీ 2021 సెప్టెంబర్‌ వరకు ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే సమాధానాలు ఇస్తోంది. అయితే చాట్‌జీపీటీ ఇకనుంచి తాజా సమాచారాన్ని కలిగి ఉంటుందని ఓపెన్‌ ఏఐ సంస్థ ద్రువీకరించింది.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ChatGPT Plus వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందరికీ కూడా ఈ అప్‌గ్రేడ్‌ అందుబాటులోకి రానుందని ఓపెన్‌ ఏఐ సంస్థ తన అధికారిక X (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించింది. ఈ అప్‌గ్రేడ్‌ ద్వారా రియల్‌ టైం సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ Bard, మైక్రోసాఫ్ట్‌ Bing.. ఇప్పటికే రియల్‌టైం సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే ఇటువంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌ల ద్వారా తీసుకున్న సమాచారాన్ని ఎల్లప్పుడూ తనిఖీ చేయడం ఎంతో ఉత్తమం. దీంతోపాటు ఓపెన్‌ ఏఐ సంస్థ మరో కీలక ప్రకటన చేసింది. చాట్‌జీపీటీ.. తన యూజర్లతో వాయిస్‌ సంభాషణలు చేయగలదని పేర్కొంది. కొత్తగా వాయిస్, ఇమేజ్ సామర్థ్యాలను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఫలితంగా కొత్త, స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌ను పొందుతారని ఓపెన్‌ ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఉదాహరణకు మీరు ప్రయాణంలో ఉన్నారని అనుకోండి. ఆ సమయంలో మీ కంటికి ఓ ఆపురూపమైన చిత్రం కనిపించిందనుకోండి. ఆ ఫోటోను చాట్‌జీపీటికి ఇన్‌పుట్‌గా అందించి, ఆ ప్రాంతం, ఆ ఫోటో గురించి వివరాలు కావాలని చాట్‌జీపీటిని కోరవచ్చని ఓపెన్‌ ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే మీరు రాత్రి కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకున్నారని అనుకోండి.. అప్పుడు ఎటువంటి వంట చేయాలో సరైన ఆలోచన లేదనుకోండి, మీ ప్రిడ్జ్‌లో ఉన్న కూరగాయల ఫోటోను చాట్‌జీపీటికి అందించడం ద్వారా.. వాటితో ఎటువంటి వంటలు చేయవచ్చో.. చాట్‌జీపీటీ సలహా ఇస్తుందని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. గత సంవత్సరం ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్‌జీపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇదే కీలక మైలురాయిగా భావిస్తారు. అనంతరం ఈ సంవత్సరం మార్చిలో గూగుల్‌ సంస్థ Bard AI చాట్‌బోట్‌ను లాంచ్‌ చేసింది. అయితే ప్రారంభంలో గూగుల్‌ AI చాట్‌బోట్‌ కొందరికే అందుబాటులో ఉండగా మే 11 నుంచి చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే బార్డ్ మాత్రం రియల్‌టైం సమాచారాన్ని కలిగి ఉండగా... చాట్‌జీపీటీ మాత్రం 2021 సెప్టెంబర్ వరకు మాత్రమే సమాచారాన్ని కలిగి ఉండేది. అయితే తాజా అప్‌గ్రేడ్‌తో ముందుగా చాట్‌జీపీటీ ప్లస్‌ వినియోగదారులకు రియల్‌ టైం సమాచారం అందుబాటులోకి వస్తుంది. కొన్ని రోజుల్లో అందరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఓపెన్‌ ఏఐ తెలిపింది. గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog