Ad Code

ఓలా నుంచి సూపర్ బైక్ ?


ప్పటి దాకా కేవలం స్కూటర్లకే పరిమితమైన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు బైక్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది.ఇప్పటికే పలు మోడళ్ల ను రెడీ చేసింది. ఇక వచ్చే మోటోజీపీ భారత్ 2023లో ప్రదర్శించనుంది. ఓలాబైక్ కొత్త బైక్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్ స్టర్ మోడళ్లలో అందుబాటులోకి రానుంది. వీటి లుక్ చూస్తే ఖచ్చితంగా స్టన్ అయ్యేలా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో, సూపర్ స్మార్ట్ ఫీచర్లతో గ్లోబల్ రేంజ్ డిజైన్ తో ఇవి చాలా బాగా ఆకర్షించనున్నాయి.ఇక వీటిని కంపెనీకి చెందిన ఫ్యాన్ జోన్లో ఉంచనున్నారు. అన్నీ కుదిరితే 2024 చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాలపై అందరిలో కూడా భారీ అంచనాలున్నాయి. అలాగే మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మోటోజీపీ భారత్ కి పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఓలా కంపెనీ మొత్తం 150 ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాక్ చుట్టూ మొబిలీటీ డ్యూటీ కోసం ఉంచారు. ఇవి మార్షల్ సపోర్ట్ తో ఉంచారు.ఇక ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మూవ్ ఓఎస్4 బీటా వెర్షన్ ని పరీక్షిస్తోంది. దీన్ని ఎంచుకున్న కస్టమర్లకు కోసం బీటా రోల్ అవుట్ అనేది ప్రారంభమైంది.అలాగే స్టాండర్డ్ వెర్షన్ వినియోగదారులందరికీ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక మూవ్ ఓఎస్4తో ఓలా దాని సొంత మ్యాప్ లను జోడిస్తోంది. వీటిని ఓలా మ్యాప్స్ అని అంటారు. రీజనరేషన్, హిల్ హోల్డ్, చార్జింగ్ టైం ప్రిడిక్షన్, చార్జింగ్ ఇంకా రైడింగ్ రేంజ్ వంటి మెరుగైన ఫీచర్లు తమ వద్ద ఉన్నాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అలాగే హైపర్ చార్జింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో డాక్యూమెంట్ సిన్సింగ్, కాంటాక్ట్ సిస్సింగ్, పైరింగ్ ఇంకా టచ్ రెస్పాన్స్ చాలా వేగంగా జరుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu