Ad Code

జియో భారత్‌ బీ1 పేరుతో మరో బడ్జెట్‌ ఫోన్‌ విడుదల


జియో భారత్‌ సిరీస్‌లో భాగంగా రిలయన్స్‌ జియో భారత్‌ బీ1 పేరుతో మరో బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో జియో భారత్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే వీ2, కే1 కార్బన్‌ మోడల్స్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో అదనపు ఫీచర్లను అందించారు. కంపెనీ వెబ్‌సైట్‌లో జియో భారత్‌ బీ1 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కంపెనీ లిస్ట్‌ చేసింది. ఇంతకు ముందు లాంచ్‌ చేసిన ఫోన్‌లతో పోల్చితే ఈ కొత్త 4జీ ఫోన్‌లో స్క్రీన్‌ సైజ్‌ పెద్దగా వుంది. ఈ ఫోన్‌ లో 2000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ ధర రూ. 1299గా ఉంది. ఈ ఫోన్‌కు బ్యాక్‌ కెమెరా కూడా ఉంది.  ఈ ఫీచర్ ఫోన్‌లో జియోపే యాప్‌ను డీఫాల్ట్‌గా అందించారు. దీంతో యూపీఐ పేమెంట్స్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో అన్నీ యాప్స్‌ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. ఈ ఫీచర్‌ ఫోన్‌ మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్‌లో కేవలం జియో సిమ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇతర సిమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఫోన్‌ను కేవలం బ్లాక్‌ కలర్‌లో మాత్రమే లాంచ్‌ చేశారు. జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 0.5 బీబీ ర్యామ్‌తో పని చేస్తుంది. ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ కెపాసిటీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 343 గంటలు ఏకధాటిగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ బరువు 110 గ్రాములుగా ఉండనుంది. ఇక ఈ ఫోన్‌లో జియో , జియోసావన్‌ వంటి యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu