భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యూజర్లకు చాలా తక్కువ ధరలో కూడా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని టెలికం కంపెనీలు కూడా వాటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్ లలో చాలా మార్పులు చేసినా, బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ చాలా తక్కువ రేట్లకే గొప్ప రీఛార్జ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా నిలుస్తుంది. రూ. 200 ధరలో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ప్లాన్ లలో రూ. 107, రూ. 153, మరియు రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ కాలానికి గాను 3GB ఉచిత డేటా, అన్ని నెట్వర్క్ లకు 200 Min ఉచిత కాలింగ్ మరియు 35 రోజులకు free BSNL Tune లను కూడా అందిస్తుంది. తక్కువ డేటా మరియు లిమిటెడ్ కాలింగ్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది. రూ. 153 ప్లాన్ 26 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1GB డేటా, 100 SMS / డైలీ మరియు Free PRBT వంటి ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా కోరుకునే వారికీ ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. రూ. 199 ప్లాన్ 200 ధరలో లభించే టాప్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హైస్పీడ్ డేటా మరియు 100 SMS / డైలీ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ అధిక డేటా కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.
0 Comments