Ad Code

వివో ఎక్స్90 ప్రో ఫోన్‌పై రూ.10వేల తగ్గింపు !


దేశీయ మార్కెట్లో ఏప్రిల్‌ నెలలో ఆవిష్కరించిన వివో ఎక్స్90 ప్రో ఫోన్‌పై రూ.10 వేల డిస్కౌంట్ ప్రకటించింది. తగ్గింపు ధర శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. కెమెరా ఫోకస్డ్ హ్యాండ్ సెట్ అమోలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ ప్రాసెసర్ విత్ వివో వీ2 చిప్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4870 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. వివో ఎక్స్90 ప్రో 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ లాంచింగ్ ధర రూ.84,999. తాజాగా రూ.10 వేల తగ్గింపుతో రూ.74,999లకే లభ్యం అవుతుంది. లెజెండరీ బ్లాక్ షేడ్‌లో అందుబాటులో ఉన్న ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 6.78 అంగుళాల (1260 x 2800 పిక్సెల్స్) అమోలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటది. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ చిప్ సెట్ విత్ వివో వీ2 చిప్ తో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu