హైదరాబాద్ లో ఛాయ్‌ ఏటీఎమ్‌ !
Your Responsive Ads code (Google Ads)

హైదరాబాద్ లో ఛాయ్‌ ఏటీఎమ్‌ !


హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫస్ట్ టైం వాటర్ టీ కాఫీ (డబ్ల్యూటీసీ)  అందుబాటులోకి వచ్చింది. మనిషి అవసరం లేకుండానే మిషన్ ద్వారా వాటర్, టీ ఇంకా కాఫీ వస్తుంది. హైదరాబాద్‌కు చెందిన వినోద్‌ కుమార్‌ ఈ మిషిన్‌ను తయారు చేశాడు. కేవలం క్యూ అర్ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా చేతికి టీ, కాఫీ, వాటర్, బిస్కెట్స్ వచ్చేస్తున్నాయి. లక్ష రూపాయలతో తయారైన ఈ మెషిన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాధారణంగా మనం ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి వెండింగ్ మిషన్ చూసే ఉంటాము. కానీ ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న మిషన్ లో టీ కాఫీ కాకుండా రకరకాల వస్తువులను కూడా పెట్టి ఉంటారు. పైగా అది కూడా పక్కన డబ్బులు పే చేస్తే ఆ వస్తువు మనకు వస్తుంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న మిషన్‌ సుమారు 36 మోటర్లతో పనిచేస్తుంది. అందుకోసం స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ఇన్‌బుల్ట్‌గా ఏర్పాటు చేస్తారు.అయితే ఈ మిషిన్‌లు సుమారు రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన వెండింగ్ మిషన్‌ కేవలం రూ. లక్షకి మాత్రమే లభిస్తోంది. ఒక్క నిమిషంలో టీ, కాఫీ, వాటర్‌ ఇలా ఏదైనా కూడా వచ్చేస్తుంది. అయితే ఇందులో చేయవలసిందల్లా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మాత్రమే.. ఈ డబ్ల్యూటీసీలో మొత్తం రెండు మెషిన్లను తయారు చేశారు. ఒక మిషిన్ నుండి పూర్తిగా వాటర్ బాటిల్ వచ్చేలా చేశారు. మరో మిషన్ లో పూర్తిగా టీ ఇంకా కాఫీ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే పేమెంట్ లింక్ అనేది ప్రత్యక్షమవుతుంది. ఆ లింకు క్లిక్ చేయగానే యూపీఐ పేమెంట్ ని చేయాలి. ఆ పేమెంట్ పూర్తవుగానే మనకి వాటర్ బాటిల్ కూడా వచ్చేస్తుంది.  ఇందులో ముందుగా 100 వాటర్ బాటిల్స్, 200 టీ కాఫీ, ఒక 50 బిస్కెట్ ప్యాకెట్లను అందులో ఉంచుతారు. ఆ స్టాక్ అయిపోయిన వెంటనే నిర్వాహకుడికి అలర్ట్ వెళుతుంది. తరువాత అలెర్ట్ రాగానే మళ్లీ స్టాక్ ను నింపి అందులో రెడీగా ఉంచుతారు. త్వరలో బస్టాండ్ లలో వీటిని రెడీ చేయనున్నారు. ఫస్ట్ ఎల్బీనగర్ ఎల్పిటి మార్కెట్ వేదికగా దీనిని ప్రారంభించారు. జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో టెక్నాలజీని వాడి దీనిని ప్రారంభించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog