Ad Code

భూమిని ఢీకొట్టబోతున్న భారీ గ్రహశకలం ?


నాసాకి చెందిన ఓసిరీస్-రెక్స్ సైన్స్ టీమ్ ఈ గ్రహశకలాన్ని 1999లో కనుక్కుంది. ఇది ప్రస్తుతం మన భూమి కక్ష్యా మార్గంలో లేదు. కానీ 2182 సెప్టెంబర్ 24న ఇది భూకక్ష్యలోకి వచ్చి, ఢీకొడుతుందని అంచనా వేశారు. ఇది అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే పెద్దది. ఇది ఢీకొట్టినప్పుడు 1,200 మెగాటన్నుల ఎనర్జీ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే ఇప్పుడున్న వాటిలో అతిపెద్ద అణు బాంబు కంటే 24 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఢీకొట్టే అవకాశం ఉంది అని మాత్రం నాసా చెప్పింది. అంచనాల ప్రకారం.. భూమిని ఢీకొట్టేందుకు అవకాశం ఉన్న గురుత్వాకర్షణ మార్గం నుంచి ఈ గ్రహశకలం వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంది అని నాసా తెలిపింది. ఒకవేళ బెన్నూ గనుక గురుత్వాకర్షణ మార్గం నుంచి వెళ్తే మాత్రం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఓసారి బెన్నూ భూమి వైపు నుంచి వెళ్తుంది. ఇలా ఇది 1999, 2005, 2011, 2017, 2023లో భూమికి దగ్గరగా దీని ప్రయాణం సాగింది. ఇది 2182లో భూమిని ఢీకొట్టే అవకాశం 0.037 శాతం ఉందని నాసా తెలిపింది. బెన్నూ గ్రహశకలం నాసా శక్తిమంతమైన ప్రమాదకరమైన గ్రహశకలాల జాబితాలో ఉంది. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 46.5 కోట్ల మైళ్ల దూరంలో ఉంటోంది.  బెన్నూ అనేది బొగ్గుతో తయారైన గ్రహశకలం. ఇది సౌర వ్యవస్థ ఏర్పడిన తొలి కోటి సంవత్సరాల కాలంలో ఏర్పడింది. దీని వయసు 450 కోట్ల సంవత్సరాలకు పైనే. ఈ గ్రహశకలాన్ని పరిశీలిస్తే, సౌర వ్యవస్థ, జీవం ఎలా ఏర్పడిందో తెలిసే ఛాన్స్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020లో ఓసీరీస్ రెక్స్ అనే స్పేస్‌క్రాఫ్ట్.. ఈ గ్రహశకలంపై దిగి.. దీని శాంపిల్స్ సేకరించింది. 

Post a Comment

0 Comments

Close Menu