Ad Code

వివో వి30 ప్రో ఫోన్ 28న విడుదల


వివో వి30 ప్రో ఫోన్‌ను ఈ నెల 28న వివో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తున్నది. జీస్ లెన్స్‌తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్‌లో ఆవిష్కరిస్తారు. జీస్ లెన్స్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఔరా లైట్ కెమెరా మాడ్యూల్, ఫోటోలు క్లిక్‌మనిపిస్తున్నప్పుడు కలర్ టెంపరేచర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు.వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది. భారత్ లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.

Post a Comment

0 Comments

Close Menu