Ad Code

శాంసంగ్ గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌4పై రూ. 25 వేల డిస్కౌంట్‌ ?


శాంసంగ్ గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4పై రూ. 25,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది ఆగస్టులో రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. శాంసంగ్  గెలక్సీ Z Flip 4 బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 89,999, కానీ ఇప్పుడు దీనిని రూ. 64,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక సెకండ్‌ వేరియంట్‌ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. రూ. 94,999, కానీ ఇప్పుడు దీనిని రూ. 69,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 1.9 ఇంచెస్‌ సూపర్ అమోఎల్‌ఈడీ కవర్ డిస్‌ప్లేను అందించారు. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ డైనమిక్‌ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనిలో ప్రధాన కెమెరా సెన్సార్ 12MP, రెండవ కెమెరా సెన్సార్ కూడా 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ముందు భాగంలో 10MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది కాకుండా ఫోన్ 3700mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫోన్ 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Post a Comment

0 Comments

Close Menu