Ad Code

అమెజాన్ కూపన్ ఆఫర్ తో పోకో ఎం 6 ప్రో స్మార్ట్ ఫోన్ !


మెజాన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పై బెస్ట్ డీల్స్, ఆఫర్లను అందిస్తుంది.  పోకో ఇండియాలో రీసెంట్ గా తీసుకు వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ పోకో ఎం 6 ప్రో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఈరోజు బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తుంది. రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదలైన పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్  రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను రూ. 10,499 ధరతో లిస్ట్ చెయ్యడమే కాకుండా రూ. 500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ను కూడా ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ మరియు కూపన్ ఆఫర్ల ద్వారా పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్  రూ. 9,999 రూపాయలకే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ను ఆఫర్ ధరతో అందుకోవచ్చు. అదే, 8GB + 256GB కలిగిన హై ఎండ్ వేరియంట్ అయితే కేవలం రూ. 12,999 రూపాయలకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 ఫాస్ట్ ప్రొసెసర్ జతగా 4GB / 6GB/ 8GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB హెవీ స్టోరేజ్ ఆప్షన్ లతో కూడా లభిస్తుంది. ఈ పోకో బడ్జెట్ 5జి ఫోన్ 8GB TurboRAM తో మరింత వేగంగా పని పని చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు బాక్స్ లో 22.5W ఛార్జర్ కూడా లభిస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu