Ad Code

జీ మెయిల్​ రిప్లై కోసం చాట్ స్టైల్​ ఇంటర్ఫేస్ ?


జీ మెయిల్​ రిప్లై కోసం చాట్ స్టైల్​ ఇంటర్ఫేస్​ను తీసుకొచ్చేందుకు గూగుల్ యత్నిస్తోంది. మరో మూడు నెలల్లో దీన్ని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు సులువుగా ఈ-మెయిల్స్​కు రిప్లై ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. మనం ఏదైనా ఈ-మెయిల్‌ను ఓపెన్ చేసినప్పుడు దాని కింద రిప్లై బాక్స్ కూడా కనిపిస్తుంది. దీనిలో మన సమాధానాన్ని రాసి పంపిస్తుంటాం. ఈ లుకింగ్ (ఇంటర్ ఫేస్)ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత అని సమాచారం. ఈ-మెయిల్ 'రిప్లై బాక్స్' ఇంటర్ ఫేస్‌ ఇకపై మనకు 'చాట్ స్టైల్'​లో కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్​లోనే ఉంది. సాధారణంగానైతే మనకు వచ్చిన ఈ-మెయిల్​ను తెరవగానే దాని కింది భాగంలో రిప్లై/ రిప్లై ఆల్​/ ఫార్వర్డ్​/ ఎమోజీ ఆప్షన్​లు కనిపిస్తాయి. ఇకపై ఈ-మెయిల్​ పైభాగంలోనే ఆప్షన్లన్నీ కనిపిస్తాయి. ఈ-మెయిల్​ పైభాగంలో పిల్​-షేప్​ కంటైనర్లు, బటన్స్​, అటాచింగ్ మీడియా, ఎమోజీలు ఉంటాయి. జీ మెయిల్​ యూజర్లకు గూగుల్ చాట్ ఇంటర్ ఫేస్ బాగా ఉపయోగపడుతుంది. యూజర్లకు వచ్చిన, యూజర్లు పంపించిన ఈ-మెయిల్స్​ను ఫుల్ స్క్రీన్​లో చూసుకోవచ్చు. రిసిపెంట్​ వివరాలను స్క్రీన్ ఎడమవైపున సెట్ చేసుకోవచ్చు. ఈ-మెయిల్‌ను కంపోజ్ చేసేటప్పుడు, కీబోర్డ్ కూడా కనిపిస్తుంది. సెండ్ బటన్ కుడివైపున ఉంటుంది. క్విక్ రిప్లై ఆప్షన్​ ఎలా, ఎక్కడ ఉంటుందో ఇంకా తెలియరాలేదు. గూగుల్ త్వరలో వాయిస్ కంపోజ్​ యూఐను కూడా జీమెయిల్​లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని Duet ఏఐతో అనుసంధానం చేసే ఛాన్స్ ఉంది.


Post a Comment

0 Comments

Close Menu