Ad Code

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంపై గూగుల్‌ ఫోకస్‌ !


గూగుల్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ని జెమినీగా లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు జెమిని సపోర్ట్‌ చేస్తుందని ప్రకటించింది. ఈ క్రమంలోనే గూగుల్‌ వన్‌ ఏఐ ప్రీమియం ప్లాన్‌ను కూడా ఇంట్రడ్యూస్‌ చేసింది. సరికొత్త గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియం ప్యాకేజీలో అత్యుత్తమ ఏఐ ఫీచర్లను ఒకే చోట బండిల్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రీమియం ప్లాన్ విస్తృతమైన స్టోరేజ్‌, ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్లను అందిస్తుందని గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రీమియం ప్యాకేజీలో గూగుల్‌ అత్యుత్తమ ఏఐ ఫీచర్‌లను ఒకే చోట అందిస్తోంది. ఇప్పటికే పాపులర్‌ అయిన గూగుల్‌ వన్‌ సర్వీసులను ఎక్స్‌ప్యాండ్‌ చేస్తుంది. గూగుల్ వన్‌ ప్రీమియం AI ప్లాన్‌కు సంవత్సరానికి రూ.6,500 ఖర్చవుతుంది. 2TB స్టోరేజ్, గూగుల్‌ ఎక్స్‌పర్ట్స్‌కి యాక్సెస్, గరిష్టంగా ఐదుగురితో షేర్ చేసుకోవడం, ఎక్స్‌ట్రా మెంబర్స్‌ బెనిఫిట్స్‌, గూగుల్‌ ఫోటోలలో అడిషినల్‌ ఎడిటింగ్ ఫీచర్లు, డార్క్ వెబ్ మానిటరింగ్ ఉంటాయి. ఈ ప్లాన్‌లో ఇతర ఏఐ ఫీచర్లతో పాటు జెమిని అడ్వాన్స్‌డ్‌కి ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించినప్పటి నుంచి కొంతమంది వినియోగదారులు 200 GB స్టోరేజ్‌ ఆప్షన్‌ చూడలేకపోతున్నారనే ఆందోళనలు ఉన్నాయి. వాస్తవానికి 200 GB గూగుల్ వన్‌ ప్లాన్‌కి సంవత్సరానికి రూ.2,100 ఖర్చవుతుంది. ఇది జెమిని అడ్వాన్స్‌డ్‌కి ఫ్రీ యాక్సెస్ మినహా గూగుల్‌ వన్‌ 2 TB, గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియం ప్లాన్ల మాదిరిగానే అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టెక్ ప్రకారం, కొంతమంది వినియోగదారులకు 200 GB ప్లాన్ కనిపించదు. ప్రీమియం పేరుతో 5 TB, 10 TB, 20 TB, 30 TB స్టోరేజీని అందించే మరో నాలుగు ప్లాన్‌లు ఉన్నాయి కానీ కొంతమంది కస్టమర్లకు ఇవి కనిపించవు. స్టాండర్డ్ (200 GB) ప్లాన్‌లో నెలకు రూ.210, ప్రీమియం (2 TB)కి నెలకు రూ.650, ప్రీమియం (5TB)కి నెలకు రూ.1,625, ప్రీమియం (10TB)కి నెలకు రూ. 3,250, ప్రీమియం (20TB)కి నెలకు రూ. 6,500, ప్రీమియం (30TB) ప్లాన్‌కి నెలకు రూ. 9,750 ఖర్చు అవుతుంది. కొంతమంది వినియోగదారులకు ప్లాన్స్ కనిపించకపోవడానికి తాజా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కారణమని TOI టెక్ సర్వేలో తేలింది. చాలా మంది గూగుల్‌ వన్‌ సభ్యులు, రూ.1300 ధర కలిగిన అత్యల్ప 100GB ప్లాన్‌లో ఉన్నవారు కూడా అన్ని స్టోరేజ్ ప్లాన్‌లను (200GB, 5TB, 10TB, 20TB, 30TB) చూడగలరు. అయితే, గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రైబర్‌లు కాని వారికి అన్ని ప్లాన్లు కనిపించవు. గూగుల్ వన్‌లో ఇంకా నమోదు చేసుకోని వారి కోసం, గూగుల్ బేసిక్‌ (100GB), ప్రీమియం, కొత్త AI ప్రీమియం ప్లాన్‌లను అందిస్తుంది. కారణం గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే కావచ్చు. ఇప్పుడు మీరు వివిధ ప్లాన్‌లలో ఒకదానికి ప్రస్తుత గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే. పైన పేర్కొన్న అన్ని ప్రీమియం-టైర్ ప్లాన్‌లను గూగుల్ వన్‌ మెంబర్స్ వీక్షించవచ్చని TOI టెక్ ధృవీకరించింది.


Post a Comment

0 Comments

Close Menu