Ad Code

కబీరా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైకులు !


గోవాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కబీరా మొబిలిటీ సెకండ్-జెన్ కేఎమ్3000, కేఎమ్4000 మార్క్-II ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. ఈ రెండు బైకులు రూ. 1.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మోడల్స్ విభిన్నమైన డిజైన్‌లను కలిగి ఉన్నాయి. ఎందుకంటే గత మోడల్ పూర్తిగా ఫెయిర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే, కేఎమ్ 4000 మరింత ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. రెండింటి మధ్య డిజైన్ పరంగా కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, రెండు మోడల్ బైకులు ఒకే డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నాయి. అదనంగా, స్వింగ్‌ఆర్మ్ మెటీరియల్ మోటార్‌సైకిళ్ల సబ్ వేరియంట్‌ల ఆధారంగా మారుతుంది. మెరుగైన పనితీరు, స్టీల్ లేదా అల్యూమినియం మిశ్రమంతో సహా బైకు ఆప్షన్లు ఉంటాయి. కబీరా కేఎమ్3000, కేఎమ్4000 పవర్‌ట్రెయిన్ మోడల్‌లు అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటాయి. కంపెనీ ప్రకారం.. ఈ టెక్నాలజీ కలిగిన బైక్‌లు గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. అంటే.. కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40కి.మీ వేగంతో దూసుకెళ్లగలవు. కబీరా కేఎమ్3000, కేఎమ్4000 మార్క్-II మోడల్స్ 201కి.మీ పరిధిని అందిస్తాయి. 1.5కెడబ్ల్యూ ఆన్-బోర్డ్ ఛార్జర్ కలిగి ఉన్నాయి. ఫాక్స్‌కాన్ అభివృద్ధి చేసిన 12కేడబ్ల్యూ ఇన్-హబ్ పవర్‌ట్రెయిన్‌తో ఈ బైక్‌లు నడుస్తాయి. 192ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను కూడా అందిస్తాయి. భద్రతా ఫీచర్లలో డ్యూయల్ సీబీఎస్ బిగ్ డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఉన్నాయి. కబీరా కేఎమ్3000, కేఎమ్4000 బైకుల మార్క్-II మోడల్‌లు వరుసగా ధర రూ. 1.74 లక్షలు, రూ. 1.76 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. ఈ మోడల్‌లపై టెస్ట్ రైడ్‌లు ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక డెలివరీల విషయానికి వస్తే.. కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా మార్చి 2024 నుంచి ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu