Ad Code

బైజూ'స్ కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషన్ దాఖలు !


బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ'స్ లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ'స్ లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్  శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీలో వేధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బైజూ'స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా బెంగళూరు ఎన్సీఎల్టీ బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం  కంపెనీ అసాధారణ వార్షిక బోర్డు జరుగుతున్న రోజే ఎన్సీఎల్టీని ఇన్వెస్టర్ల గ్రూప్ ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కంపెనీ ఫౌండర్, సీఈఓ బైజూ రవీంద్రన్ సహా కంపెనీ బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశాయి. కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ అడిట్ చేపట్టాలని కోరాయి. ఎన్సీఎల్టీలో బైజూస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తమకు తెలియదని, కానీ, ఒకవేళ ఇన్వెస్టర్లు పిటిషన్ దాఖలు చేస్తే చట్టపరంగా స్పందిస్తామని బైజూ'స్ వెల్లడించింది. వదంతులపై స్పందించబోమని పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu