Ad Code

మహీంద్రా కొత్త వేరియంట్ Z8 సెలెక్ట్ !


హీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ లైనప్‌లో మహీంద్రా కొత్త వేరియంట్ Z8 సెలెక్ట్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ ఎస్‌యూవీ వేరియంట్లలో Z8, Z8L అనే వేరియంట్‌లు ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్ ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. వచ్చే మార్చి 1 నుంచి అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్‌లో మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0-లీటర్ (mStallion) టీజీడీఐ పెట్రోల్ (200పీఎస్ 380ఎన్ఎమ్), 2.2-లీటర్ (mHawk) సీఆర్‌డీఐ డీజిల్ (175పీఎస్ 400ఎన్ఎమ్) ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో -ఎన్ జెడ్8 సెలెక్ట్ ధరలు (ఎక్స్-షోరూమ్)  పెట్రోల్ ఎంటీ రూ. 16.99 లక్షలు, పెట్రోల్ ఏటీ రూ.18.49 లక్షలు, డీజిల్ ఎంటీ రూ. 17.99 లక్షలు, డీజిల్ ఏటీ రూ. 18.99 లక్షలు. మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్ డ్యూయల్-బ్యారెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్‌ల్యాంప్‌లు, ఓఆర్‌వీఎమ్‌లపై ఎల్ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌ల వంటి ఫీచర్లను అందిస్తోంది. 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. కొత్త వేరియంట్‌కు ప్రత్యేకమైన మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. క్యాబిన్ లోపల పరిశీలిస్తే.. కాఫీ-బ్లాక్ లెథెరెట్ థీమ్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 7-అంగుళాల టీఎఫ్‌టీ క్లస్టర్‌తో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అడ్రినోక్స్ కనెక్ట్ టెక్ 60కి పైగా కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. ఇంటర్నల్ అలెక్సా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్ (FDD), మల్టీ-ట్యూన్డ్ వాల్వ్ సెంట్రల్ ల్యాండ్ (MTV-CL) టెక్నాలజీలను కలిగి ఉంది. ఇందులో నాలుగు డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి. ఇతర సెక్యూరిటీ ఫీచర్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సహా మరో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP)లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Post a Comment

0 Comments

Close Menu