Ad Code

జూన్‌ 10 నుంచి ఆపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ !


జూన్‌ 10 నుంచి నాలుగు రోజులపాటు ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌  జరుగుతుందని ఆపిల్‌ తెలిపింది. దీనిలో ఆపిల్‌ సంస్థకు చెందిన అనేక ఆవిష్కరణలు సహా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ ఆపిల్‌ ఈవెంట్‌పైన భారీ అంచనాలు ఉన్నాయి. జనరేటివ్‌ AI పైన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. మరియు ఈ విభాగంలో ఇటీవల కాలంలో నియామకాలను కూడా చేపట్టింది. డార్విన్‌ AI స్టార్టప్‌తో జతకట్టింది. ఫలితంగా దీనిపై ఆపిల్‌ సంస్థ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వరల్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో iOS 18, iPadOS 18, WatchOS అప్‌డేట్‌ సహా macOS లను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనిపై ఆపిల్‌ విడుదల చేసిన నోట్‌లో వీటిని ప్రస్తావించింది. దీంతోపాటు డెవలపర్లకు సాయం చేయడం సహా ఆపిల్‌ నిపుణులతో నేరుగా చర్చించే అవకాశం కలిగే అవకాశం ఉంది. ఆపిల్‌ సంస్థ త్వరలో ఐఫోన్‌ 16 ను లాంచ్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ కోసం GenAI ఫీచర్లను సొంతంగా అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు iOS 18 లో కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. హోంస్క్రీన్‌ను కస్టమైజ్‌ చేసుకోవడం సహా Siri లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం ఆపిల్‌ ఈవెంట్‌లో విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ను సంస్థ ఆవిష్కరించింది.అయితే ఆపిల్‌ ఈవెంట్‌ 2024 లో మరిన్ని ప్రకటనలను వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌ ప్రణాళికలు, లక్ష్యాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జూన్‌ 10 నుంచి 4 రోజులపాటు ఆపిల్‌ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా డెవలపర్లు సహా ఇతరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ సమాచారం ఇప్పటికే కొంత వెలుగులోకి వచ్చింది. ఐఫోన్‌ 16 సిరీస్‌లో భాగంగా.. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. గత మోడల్‌ ఫోన్ల కంటే ఐఫోన్‌ 16 సిరీస్‌ చిప్‌ సెట్‌, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ అప్‌ గ్రేడ్‌లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మరిన్ని అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వచ్చిన లీక్‌ల ఆధారంగా క్యాప్చర్‌ బటన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు హ్యాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుందని సమాచారం. అయితే స్టాండర్డ్ మోడళ్లు మాత్రమే యాక్షన్‌ బటన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు అన్ని మోడళ్లు USB-C ఛార్జింగ్ పోర్టు, పంచ్‌ హోల్‌ డిజైన్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu