Ad Code

ఐటెల్‌ ఐకాన్‌2 విడుదల !


టెల్‌ ఐకాన్‌2 పేరుతో మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. రోజ్‌ గోల్డ్‌, బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్‌ ధరను రూ.1099గా నిర్ణయించారు.ఈ వాచ్‌లో 24 గంటల రియల్‌ టైమ్‌ హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, క్విక్‌ కంటాక్ట్స్‌, డయల్‌ ప్యాడ్‌, కాల్‌ హిస్టరీ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌పై వాచ్‌పై ఏడాది వారంటీ అందిస్తున్నారు.ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్‌ డిజైన్‌తో దీనిని రూపొందించారు. 550 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ వాచ్‌ సొంతం. 30 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.దుమ్ము, వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‌ను అందించారు. అలాగే ఇందులో ఎస్‌పీఓ2, స్లీప్‌ పాట్రన్స్‌, హార్ట్‌రేట్‌, ఫిమేల్‌ హెల్త్‌ ఇండికేటర్స్‌ వంటి ఫీచర్లను అందించారు. దీనిలో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ ఆప్షన్‌ను కూడా అందించారు. దీంతో మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి వాటిని ఆపరేట్‌ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.

Post a Comment

0 Comments

Close Menu