Ad Code

ఐటెల్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ ఐకాన్‌ 3 విడుదల !


దేశీయ మార్కెట్లోకి ఐటెల్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఐకాన్‌ 2కి కొనసాగింపుగా ఐకాన్‌ 3 పేరుతో వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను తీసుకొచ్చారు. ఈవాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐకాన్‌ 3 స్మార్ట్‌వాచ్‌ ధరను రూ. 1699గా నిర్ణయించారు. ఈ వాచ్‌ ప్రీ బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇక ప్రీ ఆర్డర్‌ చేసుకునే మొదటి 500 కస్టమర్లకు రూ. 100 స్పెషల్‌ డిస్కౌంట్ లభించనుంది. ఇందులో 2.01 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2.5 డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌తో ఈ వాచ్‌ను రూపొందించారు. 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ వాచ్‌లో 150కిపైగా వాచ్‌ ఫేస్‌లను అందించారు. అలాగే ఐకాన్‌3 వాచ్‌ని డార్క్‌ క్రోమ్‌, మిడ్‌నైట్ బ్లూ, షైనీ గోల్డ్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు. బ్లూటూత్‌ 5.3కి సపోర్ట్ చేసే ఇందులో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. 310 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 10 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎస్‌పీఓ2, పీరియడ్ ట్రాకింగ్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. ఫైండ్‌ ఫోన్‌, ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌, వెదర్‌ అలర్ట్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu