Ad Code

నార్జో 70 సిరీస్‌ ఫోన్లు త్వరలో విడుదల ?


రియల్‌మి సంస్థ నార్జో 70 సిరీస్‌ ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌ ఫోన్లు అందుబాటులోకి ధరలోనే ఉండనున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరం నార్జో 60 మరియు నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్లను విడుదల చేసింది. అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ నెలలోనే విడుదల! : ఈ రియల్‌మి నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌ ఈనెలలోనే  విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ వివరాలు ఇటీవలే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి ఇండియా ల్యాండింగ్‌ పేజీలో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల అయింది. తొలిసారిగా గ్లాస్‌ డిజైన్‌ : ఈ గ్లింప్స్‌ ఆధారంగా ఈ రియల్‌మి నార్జో 70 డీప్‌ గ్రీన్‌ కలర్‌లో కనిపించింది. మరియు వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌తో గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉన్న తొలిఫోన్‌ ఇదేనని రియల్‌మి చెబుతోంది. ఈ గ్లింప్స్‌ ఆధారంగా ఈ ఫోన్‌ వృత్తాకార కెమెరా గ్లాస్‌ మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది హ్యాండ్‌సెట్‌కు డ్యూయల్‌ టోన్‌ ఎఫెక్ట్‌ను ఇస్తోంది. రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ తన పాత తరం మోడల్‌ 60 ప్రో కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లాట్‌ స్క్రీన్‌ డిజైన్‌తో స్లిమ్ బెజెల్స్‌ మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు మెరుగైన కెమెరా ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సోనీ IMX890 కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మెరుగైన పనితీరు కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS సహా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7S జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. దీంతోపాటు ఈ ఫోన్ Air Gestures ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu