Ad Code

AI చాట్‌బోట్‌ ద్వారా రైలు టికెట్లు బుకింగ్ !


భారతీయ రైల్వే AI చాట్‌బోట్‌ AskDisha 2.0 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ చాట్‌ బోట్‌ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది. టికెట్లు బుకింగ్‌ చేయడం, రిఫండ్‌ ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహా వివిధ సేవలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది. AskDisha 2.0 చాట్‌బోట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. CoRover AI పైన పనిచేస్తుంది. ఈ చాట్‌బోట్‌ హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌ భాషలను సపోర్టు చేస్తుంది. మరియు ఈ AI చాట్‌బోట్‌ IRCTC మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించిన రైలు టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ను (Know your PNR Status) గురించి తెలుసుకోవచ్చు, టికెట్లను క్యాన్సిల్‌ వంటి సేవలను పొందవచ్చు. వాయిస్‌ కమాండ్ల ద్వారా కూడా ఈ సదుపాయాలను పొందవచ్చు. భారతీయ రైల్వేకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ చెకింగ్‌ చేసుకోవచ్చు మరియు క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫండ్‌ పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీంతోపాటు బోర్డింగ్‌ స్టేషన్‌ మార్పులు చేయడం సహా బుకింగ్‌ హిస్టరీని కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీంతో టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. AskDisha 2.0 చాట్‌బోట్‌ను IRCTC వెబ్‌సైట్‌ మరియు మొబైల్ యాప్‌ ద్వారా యాక్సెస్‌ పొందవచ్చు. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో ఈ చాట్‌బోట్‌ లోగోను గుర్తించవచ్చు. చాట్‌ బోట్‌ ఓపెన్‌ చేసి సంబంధించిన వివరాల కమాండ్‌ను ఎంటర్ చేయాలి. దాంతోపాటు మైక్రోఫోన్‌ ఆప్షన్‌ కూడా వినియోగించుకోవచ్చు. సింపుల్‌ వాయిస్‌ కమాండ్ల ద్వారా కూడా వినియోగించుకోవచ్చు. AskDisha 2.0 మీ ఫోన్‌లో వినియోగించుకొనేందుకు ప్లేస్టోర్‌ నుంచి IRCTC రైల్‌ కనెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం మీ కావాల్సిన సమాచారం కోసం కమాండ్లు, వాయిస్‌ కమాండ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ చాట్‌బోట్‌ అందరికీ అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu