Ad Code

సేఫ్టీ రేటింగ్ సూపర్,మైలేజ్ తో టాటా టియాగో కారు !


మారుతి ఆల్టో, S-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి బడ్జెట్ కార్ల సెగ్మెంట్ లో ముందువరుసలో టాటా టియాగో కారు నిలుస్తోంది. టాటా టియాగో కారులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని సేఫ్టీ రేటింగ్. ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో ఉంది. సురక్షితమైన కార్ల పట్ల జనాల్లో ఆసక్తి పెరిగిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ఇతర కార్లు భద్రత పరంగా ఇంత అడ్వాన్స్ డ్ గా లేవు. .కానీ,టాటా టియాగో బడ్జెట్ సెగ్మెంట్ కారు అయినప్పటికీ మంచి నిర్మాణ క్వాలిటీతో వస్తుంది..NCAP క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్‌లను పొందింది. టాటా టియాగో మార్కెట్ లో రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 86Bhp పవర్, 113Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు CNG ఆప్షన్ లో కూడా వస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. మైలేజీ విషయానికి వస్తే.. కంపెనీ ప్రకారం, పెట్రోల్‌లో దాని మైలేజ్ 19.01kmpl. అదే సమయంల ఇది ఒక కిలో సిఎన్‌జితో 26.49కిమీల వరకు నడపవచ్చు. ఈ కారులో Apple CarPlay, Android Autoతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వెనుక డీఫాగర్, బ్యాక్ వైపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత పరంగా ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, EBDతో కూడిన ABS, ప్రయాణీకుల భద్రత కోసం కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu