Ad Code

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు సీఈఆర్టీ హెచ్చరిక !


గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం కీలక హెచ్చరిక చేసింది. ఈ బ్రౌజర్‌లో తాజాగా భద్రతా లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఫలితంగా ఆయా కంప్యూటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది. మార్చి 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం గూగుల్‌ క్రోమ్‌లో అనేక లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. దీని ద్వారా అటాకర్లు ఆయా కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ లోపాలను ఉపయోగించి ప్రత్యేక వెబ్‌పేజీల ద్వారా సైబర్‌ దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని CERT కోరింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, Macలో గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 122.0.6261.111/.112 ముందున్న వెర్షన్‌లు ప్రభావితం అవుతాయని పేర్కొంది. దీంతోపాటు లినిక్స్‌ 122.0.6261.111 కూడా ప్రభావితం అయ్యే జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అయితే తన బ్రౌజర్‌లో భద్రతా లోపాలను గూగుల్‌ గుర్తించిందని CERT పేర్కొంది. ఈ భద్రతా లోపాలను సవరిస్తూ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu