Ad Code

వాట్సాప్ లో వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ !


వాట్సాప్ లో  టైపింగ్ కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ ని మనం పంపించుకోవచ్చు. అయితే వాయిస్ మెసేజ్ లు పంపిస్తే కొన్నిసార్లు వినడానికి వీలు ఉండదు. అందుకే వాయిస్ ను మెసేజ్ గా టైప్ చేసి పంపే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. ఈ సరికొత్త ఫీచర్ తో వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఆడియో మెసేజ్ ని వినకుండా మెసేజ్ ని చదివే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ మెసేజ్ ఫీచర్ కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో వచ్చింది.. త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ మెరుగైన సేవలకు గానూ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఈ కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 ఎంబి యాప్ డేటా డౌన్ లోడ్ చేయాలి వాయిస్ నోట్స్ ని టెక్స్ లోకి మార్చడానికి డివైస్ స్పీచ్ రికగ్నైజేషన్ ఫీచర్ ని వాట్సాప్ లో వాడుకుంటుంది.. ఈ ఫీచర్ వల్ల సెక్యూరిటీ ఇబ్బంది ఏమి ఉండదని వాట్సాప్ చెబుతుంది.

Post a Comment

0 Comments

Close Menu