Ad Code

గూగుల్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ ఫీచర్‌ !


గూగుల్‌ సరికొత్త సేఫ్‌ బ్రౌజింగ్‌ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా మాల్వేర్‌ అటాక్‌ సహా సైబర్ అటాక్‌ల సమయంలో వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌ భద్రత ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారిన నేపథ్యంలో గూగుల్‌ తాజా ఫీచర్‌ వినియోగదారులకు మెరుగైన భద్రతను కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ప్రధానంగా ఫిష్సింగ్‌, మాల్వేర్‌ అటాక్‌ లపై దృష్టిపెడుతుందని తెలిపింది. వెబ్‌సైట్‌లను సందర్శించే సమయంలో అప్రమత్తం చేస్తుంది. 25 శాతం ఫిష్సింగ్‌ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. రియల్‌ టైం ట్రాకింగ్‌ మెరుగ్గా పనిచేస్తుందని గూగుల్‌ భావిస్తోంది. గూగుల్‌ సంస్థ తన ట్రాకింగ్‌ మెకానిజాన్ని రియల్‌టైం ఫంక్షన్‌తో అనుసంధానం చేసింది. ఫలితంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు క్యాచీ ఆధారంగా వెబ్‌సైట్‌ భద్రతను టెస్టింగ్‌ చేస్తుంది. ఆ వెబ్‌సైట్‌ URL ను ప్రైవసీ సర్వర్‌ పంపించి రియల్ టైంలోనూ భద్రతను పర్యవేక్షిస్తుంది. అనంతరం ఆ URL తన డేటాబేస్‌ లో ఉంటే, ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. అయితే ఇందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోనే వెబ్‌సైట్‌ భద్రతను గూగుల్‌ తనిఖీ చేస్తుందని, ఎటువంటి భద్రతా లోపాలు గుర్తించినా వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu