Ad Code

గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్‌ విచారణకు ఆదేశం !


గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ప్లేస్టోర్‌ ధరల విధానంలో పోటీ వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తుండడంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నవీకరించిన చెల్లింపుల విధానం పోటీ చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. దీనివల్ల యాప్‌ డెవలపర్లు, పేమెంట్ ప్రాసెసర్లు, వినియోగదారులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. పోటీ చట్టంలోని సెక్షన్‌ 4ను గూగుల్‌ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని సీసీఐ పేర్కొంది. యాప్ డెవలపర్లకు ప్లేస్టోర్‌ ద్వారా అందిస్తున్న వివిధ రకాల సేవలకు గానూ సేవా రుసుములు వసూలుచేస్తున్నామని, ఈవిషయంలో గూగుల్‌ ఇచ్చిన సమాధానం సహేతుకంగా అనిపించడం లేదని సీసీఐ తన 21 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu