Ad Code

చాట్‌ జీపీటీలో 'రీడ్‌ ఏ లౌడ్‌' ఫీచర్‌ ?


పెన్‌ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తుంది. దీంతో చాట్‌ జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ వస్తున్న చాట్‌జీపీటీ తాజాగా మోరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. 'రీడ్‌ ఏ లౌడ్‌' పేరుతో యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇకపై సమాధానాలను చదవడమే కాకుండా వినొచ్చు కూడా. ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో చదవలేవని పరిస్థితిలో ఉంటే చదువి వినిపిస్తుంది. వెబ్‌ వెర్షన్‌తో పాటు ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ కొత్త ఫీచర్‌ జీపీటీ-4, జీపీటీ-3.5 మోడళ్లలోనూ పనిచేస్తుంది. ఈ ఫీచర్‌లో మొత్తం 37 భాష్లలోనే టెక్ట్స్‌ను చదవగలుగుతుంది. భాషను తనకు తానే గుర్తించి వివరిస్తుంది ప్రత్యేకంగా లాంగ్వెజ్‌ను సెలక్ట్ చేసుకోవాల్సిన పనిలేదు. మొబైల్‌ యాప్‌లలో టెక్ట్స్‌పై క్లిక్‌ చేసి పట్టుకుంటే ఆప్షన్స్‌లో 'రీడ్‌ ఏ లౌడ్‌' ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. వెబ్‌వెర్షన్‌లో చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానం కింద స్పీకర్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu