Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌ ఆర్డర్ చేస్తే రాళ్లు వచ్చాయి !?


త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఒక వ్యక్తి మార్చి 28న ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.22,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అదే రోజు ప్యాకేజీ డెలివర్ అయింది. అయితే పార్సిల్ ఓపెన్‌ చేసిన కస్టమర్, షాక్‌ అయ్యాడు. ప్యాకేజీలో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రాళ్లు ఉన్నాయి. అతను ప్యాకేజీని తిరిగి రిటర్న్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే కంపెనీ రిటర్న్‌ లేదా ఎక్స్ఛేంజ్‌ చేయడానికి అంగీకరించలేదు. ఈ అంశానికి సంబంధించి మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ 'X'లో కస్టమర్ ఓ ఇమేజ్‌ పోస్ట్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌గా 'ఘజియాబాద్ నివాసి ఒకరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.22,000 విలువైన మొబైల్ ఫోన్‌ను ఆర్డర్ చేశానని, బదులుగా రాళ్లు వచ్చాయని పేర్కొన్నాడు! పార్శిల్‌ను రిటర్న్ తీసుకోవడానికి కొరియర్ కంపెనీ నిరాకరించిందని బాధితుడు పేర్కొన్నాడు.' అని యాడ్‌ చేశారు. ఆ వ్యక్తి గోల్డెన్ అవర్ ప్రమోషన్ సమయంలో ఇన్ఫినిక్స్ జీరో 30 5G స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ చేశాడు. 256 GB స్టోరేజ్ ఉన్న మోడల్‌ను సెలక్ట్‌ చేసుకున్నాడు. అయితే దీనిపై కంపెనీ స్పందించింది. సదరు కస్టమర్‌కు ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది. 'మీరు ఆర్డర్ చేసింది తప్ప మరేమీ డెలివరీ చేయాలని మేము కోరుకోం. మీకు ఎదురైన సమస్యకు చింతిస్తున్నాం. మీకు మరింత సహాయం చేయడానికి, దయచేసి మీ ఆర్డర్ వివరాలను ప్రైవేట్ చాట్ ద్వారా మాకు అందించండి. మీ వివరాలు ఇక్కడ గోప్యంగా ఉంటాయి. మీ స్పందన కోసం వేచి చూస్తుంటాం' అని పేర్కొంది. తమ అధికారిక హ్యాండిల్స్‌గా నటిస్తున్న సోషల్ మీడియా అకౌంట్లతో కస్టమర్లు ఎంజేగ్‌ కావద్దని సలహా ఇచ్చింది. యూజర్ల ఇంటరాక్షన్లు సేఫ్‌గా ఉండాలంటే, ఫ్లిప్‌కార్ట్‌లా నటిస్తూ ఫేక్‌ అకౌంట్లు హ్యాండిల్‌ చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని, స్పందించ వద్దని తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu