Ad Code

వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు ?


వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.24.7.19 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్‌ WaBetainfo ఈ వివరాలను వెల్లడించింది. వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో కొత్తగా మినిమైజ్‌ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్‌ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది. వాట్సాప్ కాలింగ్‌ సమయంలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకు చెక్‌ పెడుతుందని తెలుస్తోంది. వాట్సాప్‌ కాల్‌ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిమైజ్‌ బటన్‌ ఉపయోగపడనుంది. ఫలితంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో కాలింగ్‌ మరింత సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌లోనూ భారీ మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WAbetainfo ఆధారంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు మరిన్ని టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.7.16 లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ వెర్షన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను గుర్తించవచ్చు. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా స్టేటస్‌ డిజైన్‌లో వేర్వేరు మీడియా ఫార్మాట్‌లకు సులభంగా మారవచ్చు. ప్రస్తుతం స్టేటస్‌ బార్‌ వాట్సాప్‌ దిగువన ఉంది. అందులో టెక్ట్స్‌, వీడియో, ఫోటోలను వేర్వేరుగా సెలక్ట్‌ చేసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేరుగా వాట్సాప్‌ స్టేటస్‌ బార్ నుంచి మీడియాను సెలక్ట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది.




Post a Comment

0 Comments

Close Menu