Ad Code

కేంద్ర ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గిన గూగుల్‌ ?


భారత్‌కు చెందిన సుమారు 100 కుపైగా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన గూగుల్‌ తాజాగా ఈ వివాదంపై వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ జోక్యం సహా సుప్రీం కోర్టులో ఈ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఆయా యాప్‌లను ప్లేస్టోర్‌లోకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం, కోర్టులో పెండింగ్‌ కేసులు : గత శుక్రవారం గూగుల్‌ సంస్థ ప్రముఖ యాప్‌లు మ్యాట్రిమొని.కాం, భారత్‌ మ్యాట్రిమొని, నౌకరీ యాప్‌లు సహా 100 యాప్‌లను తొలగించింది. సర్వీస్‌ ఫీజుల చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం సహా దేశీయ స్టార్టప్‌ల విజ్ఞప్తులు, కోర్టు కేసులతో తాత్కాలికంగా వాటిని అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గూగుల్‌ ఇండియా అధిపతి సంజయ్‌ గుప్తాతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక సమావేశం అనంతరం గూగుల్‌ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే యాప్‌ల తొలగింపుపై భారతీయ సంస్థల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సంస్థలకు గూగుల్‌తో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. రానున్న నెలల్లో స్టార్ట్‌ అప్‌ కమ్యూనిటీ మరియు గూగుల్‌ శాశ్వత పరిష్కారానికి రాగలవని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే యాప్‌ల తొలగింపు అనంతరం మాత్రం గూగుల్‌ నిర్ణయాన్ని తాము అనుమతించమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu