Ad Code

గూగుల్ మ్యాప్స్ లో బిల్డింగుల ఎంట్రన్స్ లు కూడా చూడొచ్చు ?


గరాలలో పెద్ద పెద్ద భవనాలకు ప్రవేశదారులను (ఎంట్రన్స్) కనుగొనడంలో  సహాయపడే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ టెస్ట్ చేస్తోంది. దీని ద్వారా  ఏదైనా బిల్డింగ్‌ని ఎంచుకుని, మ్యాప్‌లో జూమ్ ఇన్ చేసినప్పుడు, ఎక్కడ ప్రవేశించాలో చూపించే గుర్తు కనిపిస్తుంది. ప్రస్తుతం, ఇది నిర్దిష్ట స్థలాలు మరియు భవనాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను మొదట ఆండ్రాయిడ్ పోలీస్ గుర్తించింది. మ్యాప్స్ లో  ఏదైనా బిల్డింగ్‌ని ఎంచుకుని, కొంచెం జూమ్ చేసినప్పుడు వాటి ప్రవేశ మార్గాలను గమనించవచ్చు. ఎంచుకున్న భవనాలు ఎరుపు రంగులోకి మారుతాయి, వాటిని ప్రత్యేకంగా కూడా చూపిస్తాయి. ఈ బిల్డింగ్స్ ప్రవేశాలు వృత్తాకార చిహ్నంతో బాణం గుర్తుతో లేదా ప్రవేశ చిహ్నంతో తెల్లటి వృత్తంతో గుర్తించబడతాయి. అయితే, కొన్ని ప్రవేశ మార్గాలు సరిగ్గా సరైన ప్రదేశంలో ఉండకపోవచ్చు, ప్రత్యేకించి చిన్న భవనాలకు వేరుగా ఉండవచ్చు. లాస్ వెగాస్, శాన్ ఫ్రాన్సిస్కో, బెర్లిన్, న్యూయార్క్ సిటీ వంటి నగరాల్లో కేఫ్‌లు, ఆఫీసులు, సూపర్ మార్కెట్‌లు,  వ్యాపార బిల్డింగ్ లలో ఈ ఫీచర్ పరీక్షించబడింది. ఇది కొన్ని చోట్ల పని చేస్తుంది కానీ కొన్ని చోట్ల పని చేయలేదు. చిన్న భవనాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండకపోయినా, మాల్స్ లేదా ఆసుపత్రుల వంటి పెద్ద స్థలాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లాలో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్‌తో పాటు, గూగుల్ మ్యాప్స్‌కి 'గ్లాన్సబుల్ డైరెక్షన్స్' వంటి ఇతర అంశాలను కూడా జోడిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu