Ad Code

ఈ ఏడాది చివరిలో వన్‌ప్లస్ 13 ఫోన్ ?


న్‌ప్లస్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్‌లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 13 ఫోన్ 2కె రిజల్యూషన్‌తో భారీ 6.8-అంగుళాల మైక్రో-కర్వ్డ్ స్క్రీన్‌తో రావచ్చని పేర్కొంది. మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించనుంది. గత మోడల్‌ల మాదిరిగానే ఈ డివైజ్ LTPO టెక్నాలజీకి సపోర్టు అందించనుంది. డిస్‌ప్లే పరంగా పెద్ద అప్‌గ్రేడ్స్ ఉండకపోవచ్చు. వన్‌ప్లస్ 12 అదే స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. డిజైన్‌లో పెద్ద మార్పుతో రానుంది. వన్‌ప్లస్ 13 బయోమెట్రిక్స్ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని లీక్‌లు పేర్కొన్నాయి. ముందున్న ఆప్టికల్ సెన్సార్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌తో రానుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ డివైజ్ అన్‌లాక్ చేయనుంది. స్పాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ఎస్ఓసీ వన్‌ప్లస్ 13కి పవర్ అందించే అవకాశం ఉంది. క్వాల్‌కామ్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్, ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 13 బ్యాక్ కెమెరా సిస్టమ్ జూమింగ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో సహా మల్టీ-ఫోకల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. మిగిలిన ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి, వన్‌ప్లస్ 13 లాంచ్ టైమ్‌లైన్‌పై ఎలాంటి సమాచారం లేదు. కానీ, సాధారణంగా వన్‌ప్లస్ ప్రతి ఏడాదిలో 2024లో ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాదిలో గ్లోబల్ రీజియన్‌లలో లాంచ్ చేయదు. ఈ ఏడాది చివరిలో చైనాలో నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు.




Post a Comment

0 Comments

Close Menu