Ad Code

రియల్‌మి పీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎర్లీ బర్డ్‌ సేల్‌ ఆఫర్లు !

                                              

దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ సిరీస్, రియల్‌మి ప్యాడ్‌ 2, వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ విడుదల కానున్నాయి. రియల్‌మి P1 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ఎర్లీ బర్డ్‌ సేల్ నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.2000 వరకు కూపన్లను పొందవచ్చు. రియల్‌మి P1 5G సిరీస్‌లో P1 5G, ప్రో మోడల్‌ ఉంది. బేస్ వేరియంట్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ 6nm మీడియోటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో కూడిన 3D VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్‌ వేడెక్కిన సమయంలో హ్యాండ్‌సెట్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అదే రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కర్వడ్‌ డిస్‌ప్లే తో వస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2160 PWM డిమ్మింగ్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైటెనెస్‌ మరియు ProXDR సపోర్టు, TUV సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఫీచర్ల పరంగా టెక్టైల్‌ ఇంజిన్‌ మరియు రెయిన్‌వాటర్‌ టచ్‌ ఫీచర్‌ సహా మరిన్ని ఫీచర్‌లతో లాంచ్‌ కానుంది. తడి చేతులతో కూడా టచ్‌ పనిచేసేలా ఈ ఫీచర్‌ వినియోగపడుతుంది. ఈ సిరీస్‌ విడుదలపై రియల్‌మి వైస్ ప్రెసిడెంట్‌ Chase Xu కీలక విషయాలు వెల్లడించారు. ఈ సిరీస్‌ పేరులోని P.. హ్యాండ్‌సెట్ పవర్‌ ను సూచిస్తుందని తెలిపారు. మిడ్‌ రేంజ్‌ మార్కెట్‌లో పనితీరు, డిజైన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ పోటీ ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. మరియు మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రియల్‌మి P సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తోపాటు రియల్‌మి ప్యాడ్‌ 2 విడుదల చేయనుంది. 120Hz సపోర్టుతో 2k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 8,360mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ మెరుగైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu