Ad Code

మే 2 నుంచి నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ తొలి సేల్‌ ప్రారంభం !


దేశీయ మార్కెట్లో మే 2 నుంచి నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ తొలి సేల్‌ ప్రారంభంకానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటలోకి రానుంది. నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 రీఫ్రెష్‌ రేటు, 1,300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. నథింగ్‌ ఫోన్‌ 2ఏలో మీడియా డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో బ్లూటూత్‌ 5.3, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తోకూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999కాగా 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 27,999గా నిర్ణయించారు. అయితే కొనగోలు సమయంలో పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.


Post a Comment

0 Comments

Close Menu