Ad Code

మే 2న వివో V30e స్మార్ట్‌ ఫోన్‌ విడుదల ?


దేశీయ మార్కెట్‌లో వివో V30e స్మార్ట్‌ ఫోన్‌ మే 2న విడుదల కానుంది. ఈ వివో V30e స్మార్ట్‌ ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD + కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ చిప్‌సెట్‌ : ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ వివో V30e హ్యాండ్‌ సెట్ స్నాప్‌ డ్రాగన్ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుందని సమాచారం. కెమెరా విభాగం పరంగా ఈ వివో కొత్త హ్యాండ్‌ సెట్‌ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలు సహా ఫ్లాష్‌ లైట్‌తో లాంచ్‌ కానుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు సెల్ఫీ, వీడియోల కోసం 32MP కెమెరాతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. వివో V30e స్మార్ట్‌ ఫోన్‌ 44W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా వేగంగా ఛార్జింగ్‌ చేయవచ్చని తెలుస్తోంది. Velvet రెడ్‌ మరియు సిల్కీ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 8GB ర్యామ్‌తో 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu