Ad Code

29 న హెచ్ఎండీ తొలి హ్యాండ్‌ సెట్‌ను లాంచ్‌ ?


నోకియా ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ  సంస్థ ఏప్రిల్‌ 29 న తొలి హ్యాండ్‌ సెట్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ మేరకు X లో పోస్టు చేసింది. గతంలోనే సంస్థ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. పల్స్‌ లేదా లెజెండ్‌ సిరీస్‌ పేరుతో వీటిని లాంచ్ చేస్తు్‌న్నట్లు తెలుస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఇప్పటికే ఈ హెచ్ఎండీ స్మార్ట్‌ ఫోన్‌లు చేసింది. అయితే పల్స్‌ లేదా లెజెండ్‌ సిరీస్‌లలో ఏ హ్యాండ్‌ సెట్‌లు విడుదల కానున్నాయనే దానిపై స్పష్టత లేదు. ఈ హెచ్‌ఎండీ పల్స్‌ సిరీస్‌ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌ తో 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 13MP ప్రైమరీ కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. హెచ్‌ఎండీ పల్స్‌ + 8GB ర్యామ్‌తో 128GB అంతర్గత స్టోరేజీ, హ్యాండ్‌సెట్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే, బ్యాటరీ మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 20W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 50MP కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌ సెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.  పల్స్ సిరీస్‌ అన్ని హ్యా్ండ్‌ సెట్‌లు Unisoc T606 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది లేదా ఏప్రిల్‌ 29 న పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu