Ad Code

8న శామ్ సంగ్ గెలాక్సీ ఎం 15 5జీ విడుదల !


దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 8న శామ్ సంగ్ గెలాక్సీ ఎం 15 5జీ విడుదల అవుతుంది  ఈ ఫోన్ ను రూ. 999 రూపాయలు చెలించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియాయ్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ MediaTek లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో వస్తోంది. దీనికి జతగా 4GB / 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లు ఉంటాయి. ఈ ఫోన్ లో అతి భారీ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ Super AMOLED ని 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ కెమేరా + 2MP మ్యాక్రో లతో ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో Full HD (1920 x 1080) 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS పైన పని చేస్తుంది మరియు 4 Android OS అప్డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను అందిస్తుందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu