Ad Code

అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ ?


మెజాన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, డీల్స్‌ ఆఫర్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ ఓపెన్, వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12ఆర్‌, వన్‌ప్లస్‌ 11, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4తో పాటు మరిన్ని డివైజ్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.19,999 ప్రారంభ ధరలో లాంచ్‌ అయింది. అయితే ఇప్పుడు అమెజాన్‌ ప్రత్యేక వన్‌ప్లస్‌ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకుంటే, కేవలం రూ.16,499కి కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 5జీ డివైజ్‌ భారతదేశంలో రూ.26,999 స్టార్టింగ్‌ ప్రైస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ని వినియోగదారులు కేవలం రూ.22,999కి కొనుగోలు చేయవచ్చు. అందుబాటులోని బ్యాంక్‌ ఆఫర్లను వినియోగించుకుని ఈ తక్కువ ప్రైస్‌ పొందవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 5జీ మొబైల్‌ రూ.24,999తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. వినియోగదారులు ఇప్పుడు అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్ సహాయంతో రూ.23,499కే సొంతం చేసుకోవచ్చు. మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్ 3 5జీ మొదట్లో రూ.33,999కి లాంచ్‌ అయింది. అమెజాన్‌, పవర్‌ అప్‌ డేస్‌ విత్‌ వన్‌ప్లస్‌ సేల్‌లో అతి తక్కువ ధర రూ.26,999కి కొనుగోలు చేయవచ్చు. రూ.5,000 ఉచిత కూపన్, బ్యాంక్ ఆఫర్‌లతో ధర భారీగా తగ్గుతుంది. వన్‌ప్లస్‌ 11 5జీ బేస్ మోడల్ ఇప్పుడు రూ.46,999కి అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌ ప్రారంభ ధర రూ.56,999 కావడం గమనార్హం. అదేవిధంగా వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ డివైజ్‌ని ఇప్పుడు రూ.31,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.39,999 స్టార్టింగ్‌ ప్రైస్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. అలానే రూ.64,999 ధరతో లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ 12 5జీ కూడా బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ బేస్ మోడల్‌ను రూ.62,999కి కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ 12ఆర్‌ 5జీ ధర కూడా బ్యాంక్ డిస్కౌంట్‌ల సాయంతో రూ.39,999 నుంచి రూ.రూ.38,999కి తగ్గింది. మరో ప్రీమియం డివైజ్ వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ భారతదేశంలో రూ.1,39,999 స్టార్టింగ్‌ ప్రైస్‌తో అడుగుపెట్టింది. అమెజాన్‌ స్పెషల్‌ సేల్‌లో రూ.1,34,999కి అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu