Ad Code

మార్స్ దక్షిణ ధృవ ప్రాంతంలో వింత ఆకారాలు ?


అంగారకుడి చుట్టూ నల్లటి సాలె పురుగుల్లాంటి ఆకారాలు తిరుగుతున్న ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో ఇవి కనిపించాయి.  అంగారకుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ఎప్పుడూ విపరీతంగా చల్లగా ఉంటుంది. అంతేగాకుండా అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ శాతం చాలా ఎక్కువ. దక్షిణ ధృవ ప్రాంతంలో చల్లదనానికి కార్బన్ డయాక్సైడ్ మంచులా గడ్డకట్టి అక్కడి నేల పొరల దిగువన చేరుతుంది. అంగారకుడిపై ఎండాకాలం రాగానే అక్కడి నేల పొరల దిగువన ఉన్న కార్బన్ డయాక్సైడ్ వేడెక్కి గ్యాస్ గా మారుతుంది. ఈ గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలిపోతుంది. దాంతో నేలలోని నల్లటి మట్టి ఎగిసిపడుతుంది. ఇలా సుమారు ఒక మీటర్ ఎత్తున నల్లటి మట్టి కుప్పలు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu