Ad Code

వాట్సప్ సర్వర్లు మొరాయించడంతో సర్వీస్ బంద్ !

వాట్సప్ సర్వర్లు మొరాయించడంతో యూజర్లు తలలు పట్టుకున్నారు. గత అర్ధరాత్రి సమయంలో వాట్సప్ లో అనేక సమస్యలను చూసినట్లు యూజర్లు  ట్వీట్స్ తో వెల్లువెత్తారు. గత రాత్రి 12 గంటల సమయంలో మెటా ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సడన్ గా పనిచేయకుండా మొరాయించింది. చాటింగ్, మెసేజ్ పంపడం, గ్రూప్ చాట్ లలో స్టేటస్ లను అప్లోడ్ చేయడం వంటి మరిన్ని సమస్య లను ఎదుర్కొన్నట్లు యూజర్లు తెలిపారు. వాట్సప్ సర్వర్ ల డౌన్ అవ్వడం వలన ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 11:44 నిముషాల నుండి వాట్సాప్ డౌన్ అయినట్లు యూజర్లు తెలిపారు. వాస్తవానికి, ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వాట్సప్ సర్వీస్ లకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు. కేవలం వాట్సాప్ యాప్ లో మాత్రామే ఈ సమస్య తలెత్తలేదు. వాట్సప్ వెబ్ లో కూడా కొన్ని సమస్య ను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అంతేకాదు, లాగిన్ అవ్వడానికి అనుమతి దొరక లేదని మరియు లాగిన్ చాలా సార్లు లాగ్ ఆఫ్ అయినట్లు కూడా చెబుతున్నారు. ఈ నెల ప్రారంభం నుండి వాట్సప్ యూజర్లకు ఈ సమస్య ఎదురవ్వడం ఇది రెండవ సారి అవుతుంది. అయితే, ఈ సమస్య చాలా త్వరగానే పరిష్కరించ బడింది. ప్రస్తుతం వాట్సప్ సాఫీగా కొనసాగుతోంది.  

Post a Comment

0 Comments

Close Menu