Ad Code

గూగుల్‌ మ్యాప్స్‌లో ఎలక్ట్రిక్‌ వాహనదారులకు ఉపయోగపడేలా కీలక ఫీచర్‌ ?


లక్ట్రిక్‌ వాహనదారులకు ఉపయోగపడేలా కీలక ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది. గూగుల్‌ మ్యాప్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ ద్వారా సమీపంలోని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలను అందిస్తుంది. రియల్‌టైం డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గానే ఈ వివరాలను మ్యాప్స్‌లో కనిపించనున్నాయి. ఛార్జింగ్‌ స్పీడ్‌ సహా ఛార్జింగ్‌ పోర్టు లభ్యత వివరాలను అందించనుంది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ మ్యాప్స్‌ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే తొలుత గూగుల్‌ బిల్ట్‌ -ఇన్ ఉన్న వాహనాలకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. రోడ్‌ ట్రిప్‌లు సహా ఇతర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్‌ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వాహనం ఛార్జింగ్ ఆధారంగా దగ్గరలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది.


Post a Comment

0 Comments

Close Menu