Ad Code

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 2 పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 2 ను డిస్కౌంట్ లో  కొనుగోలు చేయవచ్చు.దీని  సాధారణ ధర రూ.12,990 గా ఉంది. ఈ ఆఫర్ లో రూ.8,499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1750 అదనపు తగ్గింపును పొందవచ్చు. క్యాష్‌బ్యాక్‌ లేదా కూపన్లను పొందవచ్చు. దీనికి సంవత్సర కాలం పాటు వారంటీ వుంది.  దీంతోపాటు రూ.999 కే ప్రాటెక్ట్‌ + సహా ఆపిల్‌ కేర్‌ సర్వీసులను పొందవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా ప్రపంచంలోని సుమారు అన్ని పెద్ద నగరాల్లో కేవలం ఒక్కరోజులోనే సర్వీస్‌ ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్‌ డ్యూయల్‌ బీమ్‌, ఫార్మింగ్‌ మైక్రో ఫోన్లు, డ్యూయల్‌ ఆప్టికల్‌ సెన్సార్లు, మోషన్‌ డిటెక్టింగ్‌ యాక్సిలిరోమీటర్‌, స్పీచ్‌ డిటెక్టింగ్‌ యాక్సిలిరోమీటర్‌ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు H1 హెడ్‌ఫోన్ చిప్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఎయిర్‌పాడ్స్‌ అనేక కంట్రోల్స్‌ను కలిగి ఉంటాయి. డబుల్‌ ట్యాప్‌ టు ప్లే, ఫోన్‌ను నేరుగా ఆన్సర్‌ చేసేందుకు మరియు Siri వంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌పాడ్స్‌ ఛార్జింగ్‌ కోసం లైటినింగ్‌ పోర్టుతో వస్తుంది. మరియు బ్లూటూత్‌ 5.0 వైర్‌లెస్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 5 గంటలపాటు ప్లేటైం లేదా 3 గంటల వరకు ఫోన్‌కాల్‌ మాట్లాడుకోవచ్చు. అదే ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల పాటు ప్లేటైం లేదా 18 గంటలపాటు కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. iOS కొత్త వెర్షన్‌ ఐఫోన్, ఐప్యాడ్‌ మోడళ్లు మరియు iPadOS కొత్త వెర్షన్‌ ఐప్యాడ్‌ మోడళ్లు మరియు MacOS మోడళ్లకు సపోర్టు చేస్తుంది. కొత్త వెర్షన్‌ tvOS కలిగిన ఆపిల్‌ టీవీలను సపోర్టు చేస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu