Ad Code

4 స్టార్- 5 స్టార్ రేటింగ్స్‌ మధ్య తేడా ఏమిటి?


ఫ్రిజ్‌ కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్స్‌, ఫీచర్స్‌ గురించి అవగాహన ఉండాలి. ఆహారం, పచ్చి కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. ఈ కారణంగా చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. కాలంతో పాటు రిఫ్రిజిరేటర్లలో చాలా మార్పులు వచ్చాయి. మార్కెట్‌లో ఇప్పటి వరకు సాధారణ రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా కరెంటు వినియోగించేవి ఉన్నాయి. అయితే సాంకేతికత మారడంతో విద్యుత్ ఆదా చేసే రిఫ్రిజిరేటర్లు రావడం మొదలైంది. రిఫ్రిజిరేటర్లలో విద్యుత్ ఆదా కోసం 3, 4,5 స్టార్ రేటింగ్‌లు కంపెనీలు ఇస్తాయి. అంతేకాకుండా ఇన్వర్టర్ ఫ్రిజ్‌లు కూడా వచ్చాయి.  5 స్టార్ రిఫ్రిజిరేటర్లు 4 స్టార్ రిఫ్రిజిరేటర్ల కంటే చాలా ఖరీదైనవి. అలాగే వాటి నాణ్యత కూడా చాలా బాగుంది. దీనిలో 5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లలో మెరుగైన సాంకేతికత ఉంటుంది. దీని కారణంగా 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌లతో పోలిస్తే 5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లు సంవత్సరానికి 100 నుండి 150 యూనిట్ల తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఈ కారణంగా మార్కెట్లో 4 స్టార్ రిఫ్రిజిరేటర్ల కంటే 5 స్టార్ రేటెడ్ రిఫ్రిజిరేటర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 4 స్టార్ -5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లు రెండూ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. అయితే రెండు రిఫ్రిజిరేటర్‌ల మధ్య వ్యత్యాసం చేసినట్లయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఇక రిఫ్రిజిరేటర్ ధర గురించి మాట్లాడినట్లయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు చాలా ఖరీదైనవి ఉంటాయి. ఈ రిఫ్రిజిరేటర్లు విద్యుత్ ఆదా, నిర్వహణ పరంగా మరింత ఆదా చేయడంలో మీకు సహాయపడతాయి. మీకు బడ్జెట్ ముఖ్యం కానట్లయితే మీరు 5 స్టార్ రేటింగ్‌తో రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ రిఫ్రిజిరేటర్‌లు ఇతర రిఫ్రిజిరేటర్‌లతో పోలిస్తే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. అంతేకాకుండా ఈ రిఫ్రిజిరేటర్లు పర్యావరణానికి కూడా మంచివి. ఎందుకంటే అవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu