Ad Code

ఒరిజినల్‌ యాప్‌లను గుర్తించేందుకు గూగుల్‌ ప్లేస్టోర్‌లో ప్రత్యేక బ్యాడ్జ్‌లు !


గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఒరిజినల్‌ యాప్‌లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బ్యాడ్జీలను కలిగి ఉండనున్నాయి. ప్రభుత్వాలకు సంబంధించిన ఒరిజినల్‌ యాప్‌లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బ్యాడ్జీలను అందించింది. గూగుల్‌ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం లక్షల్లో యాప్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఒరిజినల్‌ యాప్‌ను గుర్తించడం చాలా కష్టమైంది. తాజాగా గూగుల్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వాలకు సంబంధించిన యాప్‌ లను సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రత్యేక బ్యాడ్జీని భారత్‌లో గూగుల్ ప్లేస్టోర్‌కు ఇటీవలే జతచేసింది. సుమారు 14 దేశాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంబంధించిన 2000 ప్రభుత్వ యాప్‌లకు అందించింది. ఈ ప్రత్యేక బ్యాడ్జీల ద్వారా నకిలీ యాప్‌ల ద్వారా మోసాల బారిన పడకుండా ఉండేందుకు వీలుంటుంది. మైఆధార్‌, డిజీ లాకర్‌, mParivahan వంటి ప్రభుత్వ యాప్‌లను సెర్చ్‌ చేసిన సమయంలో ప్రభుత్వానికి సంబంధించినవి అనే బ్యాడ్జ్‌లను గుర్తించవచ్చు. దీనిపైన క్లిక్‌ చేసిన సమయంలో ప్రభుత్వానికి చెందినదని తెలిపే వివరాలను చూపుతుంది. తన ప్లేస్టోర్‌లో భద్రతా తనిఖీలు పటిష్ఠంగా ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. ఈ బ్యాడ్జ్‌ల ద్వారా వినియోగదారులకు నకిలీ మరియు ఒరిజినల్ యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చని భావిస్తోంది. అధికారిక మెయిల్ ఐడీలను వినియోగించాలని సూచిస్తోంది. హానికర యాప్‌లు ప్లే స్టోర్‌లోకి ప్రవేశించకుండా తన వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు గూగుల్‌ పేర్కొంది. ఇందుకోసం డెవలపర్‌ రిజిస్ట్రేషన్‌ మరియు ధృవీకరణ మరింత కఠినతరం చేయనుంది. దీంతోపాటు మాల్‌వేర్‌ను అమలుచేయకుండా నియంత్రించేందుకు రియల్‌టైం స్కానింగ్‌ను మెరుగుపరుస్తుంది. ఆండ్రాయిడ్‌ VPN యాప్‌ల కోసం స్వతంత్ర భద్రతా సమీక్ష బ్యాడ్జ్‌లు కూడా ఉన్నాయి. గూగుల్‌ i/o 2024 ఈవెంట్‌ త్వరలో జరగనుంది. ఈ వేదిక నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ను విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు గూగుల్‌ పిక్సల్ 8a హ్యాండ్‌సెట్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే వీటిపై గూగుల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

Post a Comment

0 Comments

Close Menu