Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, October 26, 2012

వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు


వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అయితే వెబ్‌సైట్‌ను పెట్టుకోవాలంటే ముందుగా- సైట్‌ను పెట్టుకొనేందుకు అవసరమైన స్పేస్‌ (కనీసం 100ఎంబి నుండి ఆ పైన)ను స్పేస్‌ ప్రొవైడర్స్‌ వద్ద కొనుగోలు చేయాల్సి వుంటుంది. దాంతోపాటు డైమైన్‌ రిజిస్ట్రేషన్‌ కూడా వారి వద్దనే చేయించుకోవచ్చు. అంటే మీరు ఏ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్మించాలనుకొంటున్నారో దాన్నే డైమైన్‌ అంటారు. ఈ రెండింటికీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన రేటును తీసుకుంటుంటారు. మీరు ఎవనైనా స్పేస్‌ ప్రొవైడర్‌ను కలిస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు ఆ సైట్‌లో వుంచే కంటెంట్‌ను బట్టి సైట్‌ డిజైన్‌కు అదనంగా ఖర్చవుతుంది. పూర్తిగా డిజైన్‌ అయిన సైట్‌ను గూగుల్‌ యాడ్‌సెన్స్‌ అప్రూవల్‌కు పంపాలి. వారు మీ సైట్‌ను ఓకే చేస్తే, ఆ సైట్‌కు సంబంధించిన యాడ్స్‌ను వారు ప్రొవైడ్‌ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు మెయిల్‌ చేస్తారు. అయితే ఆ వెబ్‌సైట్‌ ఇంగ్లీష్‌లో వుంటేనే వారు అంగీకరిస్తారు.

Thursday, October 25, 2012

ఇప్పటి వరకు అనేక విధానాల ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్స్‌

ఇప్పటి వరకు అనేక విధానాల ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్స్‌ చికిత్సలో చేస్తున్నారు. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన కంపెనీ కొత్త తరహా విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ట్యూమర్స్‌ను మరింత ఖచ్చితంగా, లోపరహింతగానూ తొలగించవచ్చునని సంస్థ తెలుపుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి క్లినికల్‌ ట్రయిల్స్‌ను కంపెనీ యూరప్‌, అమెరికాల్లో విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.
దీని గురించి దీని సృష్టికర్త ఇజ్రాయిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన యోరమ్‌ పాట్లీ మాట్లాడుతూ - ఇది సరికొత్త తరహా విధానం. దీంట్లో రోగికి ఎటువంటి హాని జరగదు. దీనిలో అతిసూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుత్‌ దైన్య తరంగాలను రోగి ట్రూనర్స్‌ వద్ద వివిధస్థాయిల్లో ప్రసరింపజేయటం ద్వారా ట్యూనర్స్‌ను నిర్మూలించటం సాధ్యమౌతుందంటున్నారు. దీన్ని ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌ థెరఫీగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ విధానంలో ఫలితాలు బావున్నాయని యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లోన్సిస్‌ చికాగో వారు సైతం ధృవీకరించారు.
గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నటువంటి రోగికి చెమోధ్రోగ్రఫీ, రేడియోషన్‌ థెరఫీ, సర్జరీల ద్వారా విజయవంతం అయిన వారి సంఖ్య కంటే, ఈ ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌ థెరఫీ చికిత్స చేయించుకున్న వారు త్వరగా కోలుకున్నట్లు వెల్లడైంది.

Saturday, October 20, 2012

బ్రాడ్‌కాస్ట్‌ టెలివిజన్‌ రూపంలో సెల్‌ఫోన్‌

టెక్నాలజీ ఎంత వేగంగా మార్పులు తీసుకువస్తోందో, మారిన టెక్నాలజీని అందిపుచ్చుకునేంతలోనే మరో టెక్నాలజీ రావటం ఎంతో సహజంగా మారిపోయింది. అందరికీ బుల్లిపెట్టెగా ఎంతో సుపరిచితమైన టెలివిజన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీ రాకతో రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం ఎవరైనా టెలివిజన్‌ చూడాలనుకుంటే ఇంట్లోనో, ఆఫీసులో ఉన్న టివిని ఆన్‌ చేస్తారు. లేకపోతే, ఎలా..? ప్రయాణం చేస్తున్నారు..మీకిష్టమైన క్రికెట్‌ మ్యాచ్‌ వస్తోంది. అప్పడు చూడాలనుకుంటే ఎలా? మారిన టెక్నాలజీ వల్ల ఇది ఎంతో సులభం. ప్రస్తుతం బ్రాడ్‌కాస్ట్‌ టెలివిజన్‌ రూపంలో సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాలను వీక్షించే సౌలభ్యం లభిస్తోంది. డివిబి-హెచ్‌ టెక్నాలజీని సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాల కోసమే ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇప్పుటికే ఈ డివిబి-హెచ్‌ టెక్నాలజీని యూరప్‌, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలైన ఇండోనేషియా, తైవాన్‌, మలేషియాల్లో ప్రవేశపెట్టగా ఇటీవలే భారత్‌లోనూ ఇది ప్రవేశించింది. ఈ డివిబి-హెచ్‌ టెక్నాలజీ ద్వారా పై దేశాల్లో ఇప్పటికే సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ ప్రసారాలు ప్రసారమౌతున్నాయి.
జిఎస్‌ఎమ్‌, సిడిఎమ్‌ఏ రెండింటిలో టెలివిజన్‌ ప్రసారాలను సెల్‌ఫోన్‌లో చూడాలంటే మాత్రం మూడో తరం (ధర్డ్‌ జనరేషన్‌) నెట్‌వర్క్‌ ప్రొవైడర్స్‌ కలిగి ఉండాలి. 3.5జి, వైమ్యాక్స్‌ సౌకర్యాలు సెల్‌ఫోన్‌ తయారీదారుడు పొందుపరిచి ఉండాలి. కేవలం జిపిఆర్‌ఎస్‌(జనరల్‌ ప్యాకెట్‌ రేడియో సర్వీసెస్‌) అందజేయటమే కాకుండా, బ్రాడ్‌కాస్ట్‌ టెక్నాలజీ ద్వారా వేగవంతంగా మాస్‌ కంటెంట్‌ను ఆపరేటర్‌ వినియోగదారునికి చేరవేసే టెక్నాలజీలో నైపుణ్యం పొంది ఉండాలి. మూడో తరం సర్వీస్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గంటకు 100 నుంచి 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చు. సినిమాలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను డౌన్‌లోడింగ్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అంతేగాక, టెలివిజన్‌ ప్రసారాలను సైతం చూదవచ్చు. 1995లోనే దీనికి సంబంధించిన వివరాలను హార్వర్డ్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ క్లేటన్‌ క్ట్రిస్టిన్సీ డివిబి-హెచ్‌ను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ప్రవేశించాక, ఎక్కువ మంది అమెరికన్లు తమకిష్టమైన ఆటలను సెల్‌ఫోన్‌ను ఉపయోగించి వీక్షిస్తున్నట్లు వెల్లడైంది. ఆఫీసుకు వెళుతూ ఇంటర్నెట్‌ను వినియోగించే వారికంటే, తమ సెల్‌ఫోన్‌లో మల్టీమీడియా కంటెంట్‌ను డౌన్‌లోడింగ్‌ చేసుకునేవారి సంఖ్య మూడింతలు పైగా ఉందని వెల్లడైంది. ప్రత్యేకించి పర్సనల్‌ డిజిటల్‌ అసెస్టింట్స్‌(పిడిఏ) వంటివి, కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్స్‌లు, సెల్‌ఫోన్‌ల వాడకం పెరిగాక నెట్‌వర్కింగ్‌ ఏర్పడింది. ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం నుంచి మరో ఎలక్ట్రానిక్‌ పరికరంతో అనుసం ధానం ఏర్పరచటానికి నెట్‌వర్కింగ్‌ ఎంతో ముఖ్యమైనది. నెట్‌వర్కింగ్‌ కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీయే ఈ డివిబి-హెచ్‌. ఇది పూర్తిస్థాయిలో వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి వస్తే టెలివిజన్‌ చూసేవారి సంఖ్య కన్నా, సెల్‌ఫోన్‌లోనే ప్రత్యక్ష ప్రసారాలు చూసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
సెకనుకు నిర్ణీత పరిధిలో డేటాను వెయ్యి భాగాలుగా విడగొట్టి డేటాను ఏకకాలంలో ఫ్రేమ్‌గా పొందుపరుస్తుంది. అంటే..సెల్‌ఫోన్‌లో 50 మల్టీఫ్లెక్స్‌ ఛానల్‌ చూడాలనుకుంటే..గరిష్టంగా 0.2 నుంచి 0.5 మెగాబైట్స్‌ను సెకనుకు ఇస్తూ దాన్ని 4 నుంచి 5 ఎమ్‌బిపిఎస్‌ వరకు కనిష్టంగా డేటాను ఈ డివిబి టెక్నాలజీ ప్రసారం చేస్తుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ పై దూరదర్శన్‌ ప్రయోగాత్మకంగా ఒక ట్రయిల్‌ను చేసింది కూడా. ప్రసార భారతి ఈ టెక్నాలజీ వాడకాన్ని దేశంలో అనుమతించింది. తద్వారా డిడి నేషనల్‌, డిడి న్యూస్‌, డిడి స్పోర్ట్స్‌, డిడి భారతి వంటి ఛానల్స్‌నే గాక, ఎనిమిది ప్రాంతీయ ఛానల్స్‌ను సెల్‌ఫోన్‌లో ఉచితంగా చూసే సౌలభ్యం ఉంది. గత నెలలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ అయిన నోకియాతో ప్రసార భారతి ఒప్పందం కుదర్చుకుంది. నోకియా సంస్థ ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతం పూర్తిగా డివిబి-హెచ్‌ టెక్నాలజీ అనుగుణంగా ఉండే హ్యాండ్‌సెట్లను రూపొందించటనున్నట్లు ప్రకంటించింది. భవిష్యత్‌లో దీనివల్ల కంప్యూటర్‌ అనేదానికి సరికొత్త నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుందని నోకియా ఆసియా సింగపూర్‌ హెడ్‌ పవన్‌ గాంధీ వ్యాఖ్యానించటం ఈ టెక్నాలజీ ఎంతవేగంగా ఉందో తెలియజేస్తోంది. దీనివల్ల గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణిస్తూ ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసుకోవటం, మల్టీమీడియా కంటెంట్‌ను యాక్సెస్‌ చేయటం వంటి పనులు సులభతరం అవుతాయి. పైన చెపినట్లు ఈ విధంగా యాక్సెస్‌ చేయాలంటే జిఎస్‌ఎమ్‌లో అయితే మూడోతరం (3జి) నెట్‌వర్క్‌ అవసరం ఎంతో ముఖ్యం. సిడిఎమ్‌ఏలో క్వాలికామ్‌ ప్రాధాన్యమైనది. (ఈ క్వాలికామ్‌ అమెరికాలో ఎఫ్‌ఎల్‌ఓ స్టాండర్స్‌ అనుగుణంగా రూపొందిచబడింది.) వైర్‌లెస్‌ మీడియా స్టేటజీస్‌ (డబ్ల్యుఎమ్‌ఎస్‌) అనే సంస్థ గణాంకాల ప్రకారం 2007 నాటి చివరికి డిజిటల్‌ వీడియో బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది భారీగా విస్తరిస్తుందని తెలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో 2008లో జరిగే ఒలంపిక్‌ గేమ్స్‌ను సెల్‌ఫోన్స్‌లో చూడటానికి వీలుగా అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్‌ కాంటెంట్‌ను డెవలప్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి చినాబీ మల్టీమీడియా మెబైల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అని పేరు పెట్టింది. ఇప్పటికే నోకియా ఎన్‌ 92 మోడల్‌ను భారతదేశంలోనూ ప్రవేశపెట్టింది. ఈ డివిబి ప్రాజెక్ట్‌ ప్రపంచం మెత్తం మీద 300కి పైగా బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లు, తయారీదారులు ఇందులో పాలుపంచుకోగా 35 దేశాలు ఇప్పటివరకు ఈ డివిబి టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్‌లో టెలివిజన్‌ చూడాలి అనుకుంటే ఖరీదైన వ్యవహారంగా పేర్కొనవచ్చు. నోకియా, మోటరోలా, కొరియాకు చెందిన స్యామ్‌ సంగ్‌ సంస్థలు ఈ టెక్నాలజీతో ఉన్న హ్యాండ్‌సెట్లను రూపొందిస్తున్నాయి. వాటికోసం 30,000 రూపాయలపైనే వెచ్చించాల్సి ఉంది. నోకియా ఎన్‌77
నోకియా సంస్థ త్వరలో ఎన్‌77 టివి సెల్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల
చేయనున్నట్లుగా వెల్లడించింది. దీని ద్వారా టెలివిజన్‌ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చునని తెలియజేసింది. ఈ సెల్‌ఫోన్‌లో స్క్రీన్‌ 2.4 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. దీంట్లో ప్రత్యక్ష ప్రసారాలను 30సెకన్ల తర్వాత రీప్లే ద్వారా చూడగలిగే సౌకర్యం ఉందని సంస్థ పేర్కొంది. ఇంతకుముందు విడుదల చేసిన ఎన్‌ సిరీస్‌ కన్నా ఇందులో అత్యాథునికమైన ఫీచర్లు పొందుపరిచినట్లు సంస్థ తెలిపింది. ఎమ్‌పి3 ప్లేయర్‌, 2మెగాపిక్సల్‌ కెమెరా, వెబ్‌బ్రౌజింగ్‌, ఈ-మెయిల్‌ యాక్సింగ్‌ ఇందులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఇది సింబయాన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది.

Friday, October 19, 2012

అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని


 డాల్ఫిన్‌


వాతావరణంలో మార్పులను తెల్సుకోవటానికి శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. సముద్ర గర్భంలో ఏర్పడే మార్పుల ఫలితంగా ఒక్కోసారి వాతావరణంలో అనూహ్య పరిణామాలు సంభవించటం జరుగుతున్నాయి. దీంతో సముద్రగర్భంలో శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్య సమాచారం కోసం కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదేమిటనగా- డాల్ఫిన్‌ తల భాగంలో ప్రత్యేకంగా రూపొందించబడిన సెన్సార్‌లను అమర్చటం ద్వారా వాటిని పర్యవేక్షిస్తూ సముద్రగర్భంలోని మార్పులను సులభంగా తెల్సుకోవచ్చని అంటార్కిటిక్‌ సముద్ర అధ్యయనం చేస్తున్న డేనియల్‌ కోస్టా అనే శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఓషియోగ్రఫీలో ఎంతటి అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని వినియోగించినా కొన్ని అంతుచిక్కని రహస్యాలు మిగిలిపోయాయి. అయితే డాల్ఫిన్‌లను వినియోగించటం ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనటం కొంతమేర సాధ్యమౌతుందని నిపుణులు అంటున్నారు.

Thursday, October 18, 2012

టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న బిబిసి

బ్రిటిష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న బిబిసి ఆన్‌లైన్‌ టివి సర్వీస్‌లోకి ప్రవేశించింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా....? బిబిసిలో మీరు గత ఏడు సంవత్సరాల్లో చూడకుండా మిస్‌ అయిన ప్రోగ్రామ్‌లను ఈ సర్వీస్‌ ద్వారా డౌన్‌లోడింగ్‌ చేసుకునే సదుపాయాన్ని బిబిసి కల్పిస్తోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారులు గత ఏడు సంవత్సరాల్లో తాము ఏయే అంశాలను చూడకుండా పోయారో, అవన్నీ ఈ సర్వీస్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని బిబిసి వెల్లడించింది.
ఈ సర్వీస్‌ గురించి బిబిసి డైరక్టర్‌ జనరల్‌ మార్క్‌ ధామ్సన్‌ మాట్లాడుతూ - ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి వీడియో సర్వీస్‌లకు సైతం సవాలు లాంటిది. ఈ సర్వీస్‌ను ప్రవేశపెడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు.
                                బిబిసి ఐప్లేయర్‌..
బిబిసి ఈ సర్వీస్‌ను ఐ-ప్లేయర్‌ పేరుతో ప్రారంభించింది. దీని వల్ల బిబిసిలో ప్రసారమయిన గత ఏడు సంవత్సరాల వీడియోలను ఇందులోంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవటమే గాక, ఇతర ప్రముఖ టెలివిజన్‌ ఛానెల్స్‌కు సంబంధించిన వీడియోలు సైతం లభిస్తాయని బిబిసి తెలుపుతోంది. ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఉన్నటువంటి యూట్యూబ్‌, ఇతర వీడియో సర్వీస్‌లకు భిన్నంగా ఈ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు తాము చేరువవుతామని సంస్థ తెలుపుతోంది.

Wednesday, October 17, 2012

కంప్యూటర్‌ డేటాను కాపాడుకోవటం అతిపెద్ద సమస్యగా మారింది. అందులోనూ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవారికి ఇది మరీ ఎక్కువగా ఉంది




సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ ల్యాప్‌టాప్‌ ద్వారా శత్రువు ఎక్కడ ఉన్నాడో చూసి, శత్రువుకి సంబంధించిన డేటాను క్షణాల్లో సంపాదించటం పలుసార్లు చూశాము. కానీ మారిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరికీ తమ కంప్యూటర్‌ డేటాను కాపాడుకోవటం అతిపెద్ద సమస్యగా మారింది. అందులోనూ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవారికి ఇది మరీ ఎక్కువగా ఉంది. గతంలో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగించుకొన్న కొద్ది రోజులకే, కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి రావటం, లేకపోతే సరికొత్త చిప్‌ను చిప్‌ తయారీ కంపెనీలు విడుదల చేయటం జరిగేది. కొత్తగా వచ్చిన వాటితో తమ ల్యాప్‌టాప్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకున్నప్పుడు అనేకరకాలైన అవాంతరాలు ఎదురు అవుతాయి.
పాతతరం ల్యాప్‌టాప్‌లతో రిపేర్ల సమస్యలు, ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలన్నా ఖరీదైన వ్యవహారంగా ల్యాప్‌టాప్‌ పోతే, అందులోని డేటాను తిరిగి పొందటం చాలా కష్టం. మరియు . అదీగాక, పొరపాటున చేతిలో నుంచి జారినా, కిందపడి డ్యామేజి అయినా, అందులో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్‌ కరెప్ట్‌ అయితే, ఇంక డేటా అంతే.
మారిన టెక్నాలజీ వల్ల అత్యాధునికమైనటువంటి ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో పోయిన ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేస్తే చాలు. అందులోని డేటాను తిరిగి మీ మెయిల్‌కు వచ్చే విధంగానూ ఏర్పాట్లు చేసుకోవచ్చు.అంతేగాక, హార్డ్‌డిస్క్‌ను, ల్యాప్‌టాప్‌ను సైతం చాలా ధృడమైనటువంటి మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటి ల్యాప్‌టాప్‌లు నిప్పులోనూ, నీటిలో మునిగినా తట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.
గతంలో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్‌ల కన్నా భారీ పరిమాణంలో ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌లు లభించటం ఓ రకం అయితే, వాటిలో అత్యాధునికమైనటువంటి ఫీచర్లు సైతం తక్కువకే లభించటం వీటి ప్రత్యేకతను తెలుపుతున్నాయి. ప్రస్తుత తరంలో అతి తక్కువ ధరకే రూ.18వేల నుంచి లభిస్తున్నాయి. దీంతో వీటిని వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో 100 మందిలో 12 మంది వద్ద మాత్రమే కంప్యూటర్స్‌ ఉంటే, ప్రస్తుతం ఆ స్ధానాన్ని ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో కంప్యూటర్లను కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది డెస్క్‌టాప్‌ల కంటే, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు వైపే మెగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారత్‌లో ల్యాప్‌టాప్‌ వినియోగదారులను సర్వే చేయగా వారు తాము కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని ప్రశిస్తే, తాము కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ తాము ఇండోర్‌లో ఉన్నసమయంలోనూ వర్క్‌ చేసుకోవటానికి అనుకూలంగా ఉండటమే కారణంగా తెలిపారు. మరొక విషయం ఏమిటంటే..తాము ఏ ల్యాప్‌టాప్‌ ఛాసిస్‌ ధృఢంగానూ, దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందో ఆ ల్యాప్‌టాప్‌నే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఇంటర్నల్‌గా బ్లూటూత్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ ఉన్నట్లయితే వాటితో ప్రయివేట్‌ ఛాటింగ్‌ చేసుకోవటం ఎంతో సులభమని పలువురు భారతీయ యువతీయువకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధృఢంగానూ అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకొన్నటువంటి ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న మోడల్‌ తొషిబా కంపెనీకి చెందినది. ఎందువల్ల అంటే దీన్ని అత్యాధునికమైనటువంటి పాలిమర్‌ మెటీరియల్‌ నుంచి తయారుచేశారు. ఇది గీతలు, మంటలు, నీటిలో తడిసినా అందులోని డేటాకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.
మారుతున్న టెక్నాలజీ..
ట్రస్టడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ మాడ్యుల్‌ (టిఎమ్‌పి)ను స్టాండర్డ్‌గా కంప్యూటర్‌ తయారీ కంపెనీలు తీసుకొన్నాయి. దీని ఆధారంగానే కంప్యూటర్‌ తయారీ కంపెనీలు ఒక అలయెన్స్‌గా ఒప్పందం ప్రకారం హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులు తమకు నచ్చిన ప్రకారం ల్యాప్‌టాప్‌ను మార్చుకునే సౌలభ్యం ప్రస్తుత టెక్నాలజీ వల్ల సాధ్యమౌతోంది. అంతేగాక ఈ టిఎమ్‌పి వల్ల హార్డ్‌వేర్‌కు రక్షణ ఏర్పాట్లు కలగటమేగాక, ఇతరుల నుంచి చౌర్యం చేసినటువంటి ల్యాప్‌టాప్‌లను ఇట్టే సులభంగా తెలుసుకోవచ్చు. అంటే...సెక్యూరిటీ అనేది అంతర్గతంగా ల్యాప్‌టాప్‌లో పొందుపరచటం వల్ల అల్గారిథమ్స్‌ ఎంబీడెడ్‌ ఆధారంగా మైక్రోచిప్‌ను ఇందులో అమరుస్తారు. ఈ మైక్రోచిప్‌ ద్వారా టిఎమ్‌పి ఎన్‌క్రిప్షన్‌గా ఉండటం వల్ల హార్డ్‌డిస్క్‌లో ఉన్నటువంటి డేటాకు రక్షణగా నిలుస్తుంది.
ఈ టిపిఎమ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఏ ల్యాప్‌టాప్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ పని చేస్తాయో, ఆ నెట్‌వర్క్‌లోకి మీరు అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నిస్తే, అది దుర్లభం. అంతేగాక అందులోకి మీరు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను తప్పకుండా ఎంటర్‌ చేయాలి. సరైన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయకపోతే మీరు ప్రవేశించటం అడ్డుకోవటమే గాక, మీరు అక్రమంగా నెట్‌వర్క్‌లోకి చొరబడుతున్నారని సర్వర్‌ని అలర్ట్‌ చేస్తుంది. పదేపదే మీరు అక్రమంగా ప్రవేశించటానికి ప్రయత్నిస్తే మీ సిస్టమ్‌ను హ్యాంగ్‌ చేయగల సత్తా ఈ టెక్నాలజీకి ఉంది. ఇందులోనూ అప్‌గ్రేడ్‌ టెక్నాలజీ సైతం వచ్చింది. దీని సాయంతో మీరు సిస్టమ్‌కు ఫింగర్‌ ప్రింట్‌, లేకపోతే బయో మెట్రిక్‌ ఆధారిత టెక్నాలజీని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇతరులు ఎవ్వరూ అక్రమంగా డేటాను చోరీ చేయలేరు.

Tuesday, October 16, 2012

Abdulkalam his name and website


మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తన పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించించారు. ఈ వెబ్‌వల్ల ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండటం సాధ్యమౌతుందని ఆయన పేర్కొన్నారు. అందులోనూ విద్యార్థులను ఎంతో ఇష్టపడే కలాం..వారితో అనుంబంధం మరింత దగ్గరగా ఉండేందుకు ఇంటర్నెట్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అన్నా యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో అబ్దుల్‌కలాం దీన్ని ప్రారంభించారు. కలాం పేరిట ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌కు ప్రశ్నలు, సందేహాలను విద్యార్థులు ఇ-మెయిల్‌ చేసి తీర్చుకోవచ్చునని కలాం తన ప్రసంగంలో తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఇప్పటికీ కలాంపేరిట ఈ-మెయిల్స్‌ రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నాయి. మీరు కలాం వెబ్‌సైట్‌ను వీక్షించాలనుకుంటే... http://www.abdulkalam.com అని టైప్‌ చేయండి.

Monday, October 15, 2012

అబ్దుల్‌కలాం తన పేరుతో వెబ్‌సైట్‌


మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తన పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించించారు. ఈ వెబ్‌వల్ల ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండటం సాధ్యమౌతుందని ఆయన పేర్కొన్నారు. అందులోనూ విద్యార్థులను ఎంతో ఇష్టపడే కలాం..వారితో అనుంబంధం మరింత దగ్గరగా ఉండేందుకు ఇంటర్నెట్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అన్నా యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో అబ్దుల్‌కలాం దీన్ని ప్రారంభించారు. కలాం పేరిట ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌కు ప్రశ్నలు, సందేహాలను విద్యార్థులు ఇ-మెయిల్‌ చేసి తీర్చుకోవచ్చునని కలాం తన ప్రసంగంలో తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఇప్పటికీ కలాంపేరిట ఈ-మెయిల్స్‌ రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నాయి. మీరు కలాం వెబ్‌సైట్‌ను వీక్షించాలనుకుంటే... http://www.abdulkalam.com అని టైప్‌ చేయండి.

Saturday, October 13, 2012

ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో ప్రత్యేకత కలిగిన పొస్తిని కంపెనీని గూగుల్‌ చేజిక్కించుకుంది.


ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో ప్రత్యేకత కలిగిన పొస్తిని కంపెనీని గూగుల్‌ చేజిక్కించుకుంది. తద్వారా ఇంటర్నెట్‌లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్‌కు ఉన్న ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విధానానికి ధీటుగా గూగుల్‌ సామర్థ్యం సంతరించుకుందని సంస్థ వెల్లడించింది.


జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్‌లో విడుదల చేసింది. ల్యుమెక్స్‌ డిఎమ్‌సి-ఎఫ్‌జడ్‌50 పేరుతో వ్యవహరించే ఈ డిజిటల్‌ కెమెరాలో అత్యుత్తమైన జూమింగ్‌ చేసుకోవచ్చునని తెలిపింది. మ్యానువల్‌గా కూడా అనుకూలమైన విధంగా మార్చుకోవచ్చునని పేర్కొంది. ఇందులో ఫొటోలను ఢఫాీల్ట్‌గా టిఫ్‌ ఫార్మేట్‌లో సేవ్‌ చేసుకునే సౌలభ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీడియోలను సైతం ఎమ్‌పిఈజి4 ఫార్మేట్‌ ద్వారా రికార్డు చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. దీని వెల కూడా మార్కెట్‌లో ఉన్నటువంటి ఇతర డిజిటల్‌ కెమెరాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని సంస్థ పేర్కొంది. ధర రూ.20,000/-.

ప్రముఖ ఇంటర్నెట్‌ కంపెనీ రీఢఫ్‌ీ డాట్‌ కామ్‌ ఐ-షేర్‌ పేరిట సరికొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తమ యూజర్లు వీడియోలను, పిక్చర్లను ఇతరులకు పంపించేందుకు ఇది ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఒకే రకమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను, భావాలను ఒక దగ్గర ప్రదర్శించవచ్చునని పేర్కొంది. దీని ద్వారా భారతీయ యువత తమ ప్రతిభాపాటవాలను ఇంటర్నెట్‌ ద్వారా అందరికీ తెలియజెప్పవచ్చునని తెలిపింది. ఐ-షేర్‌ ద్వారా కేవలం వివిధ రకాలైన యూజర్లే గాక, కంపెనీలు సైతం తమ గురించి వెల్లడించే సౌలభ్యమూ ఉంటుందని తెలిపింది. కంపెనీ సిఇఓ, ఛైర్మన్‌ అజిత్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతన్న సెల్‌ఫోన్ల వినియోగం ఫలితంగా ఈ సర్వీస్‌కు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సర్వీస్‌ యుట్యూబ్‌కు కాపీ కాదని, మరో ప్రత్యేకమైన సర్వీస్‌గా దీన్ని కంపెనీ డైరెక్టర్‌ అగర్వాల్‌ తెలిపారు. త్వరలో రియాలిటీ, టాలెంట్‌ షో 'వాయిస్‌ ఆఫ్‌ రెఢఫ్‌ీ ఆన్‌ జీ సారేగమప' ద్వారా యువతరంలోని టాలెంట్‌ను వెలికి తీస్తామని సంస్థ తెలియజేసింది.

online videos amazing

సాంకేతిక పరిజ్ఞానానికి మరికొంత సృజనాత్మకత జోడిస్తే ఆన్‌లైన్‌ వీడియోలో అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. కళను ఆస్వాదిస్తూనే కాసులనూ ఆర్జించొచ్చు. లేటెస్ట్‌గా దూసుకువస్తున్న ఆన్‌లైన్‌ వీడియో ఇప్పుడు వెబ్‌ ప్రపంచంలో వీరవిహారం చేస్తోంది. ఆన్‌లైన్‌ వీడియోలో తమ సత్తా చాటేందుకు ఔత్సాహికులను పలు వెబ్‌సైట్లు ఆహ్వానిస్తున్నాయి. రివెర్‌, ఫ్లిక్య్సా, మెటాకేఫ్‌, ఆటమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర సైట్లు అమెచ్చూర్‌ వీడియో ప్రొడ్యూసర్లు రూపొందించిన క్లిప్పింగ్స్‌ను ప్రదర్శిస్తూ వారికి ఎంతోకొంత రాబడినీ సమకూర్చుతున్నాయి. రెవిన్యూషేరింగ్‌ (రాబడి పంపిణీ) పద్ధతిలో అమెచ్యూర్‌ ప్రొడ్యూసర్ల నుండి హోమ్‌మేడ్‌ వీడియోను ఆయా వెబ్‌సైట్లు తమ సైట్లలో పొందుపరుస్తున్నాయి.
ఔత్సాహిక వీడియో ప్రొడ్యూసర్లు వీడియోను షూట్‌ చేసి ఎడిట్‌ చేసి దాన్ని ఈ వెబ్‌సైట్లకు సబ్‌మిట్‌ చేయడం ద్వారా ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా సైట్లతో వీరు పంచుకునే అవకాశం ఉంది. మెయిన్‌ క్లిప్‌కు ముందూ, తర్వాత ప్రకటనలను ప్రసారం చేయడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వెబ్‌పేజ్‌ సరౌండింగ్స్‌లో కూడా ప్రకటనలకు అవకాశం ఉంటుంది. వీడియో ప్రొడ్యూసర్లకు చెల్లింపులు సాధారణంగా ఆ సైట్‌ వీక్షకుల సంఖ్యను బట్టి ఉంటుంది. 1000 వ్యూస్‌కు 200 రూపాయలు లేదా ఒక్కో క్లిక్‌కు 50 రూపాయల వరకూ వీడియో ప్రొడ్యూసర్లకు అందే వీలుంది. రాబడి వనరులు పరిమితంగానే ఉన్నా ఎక్కువ మంది వ్యూయర్లను ఆకర్షించే విధంగా క్లిప్పింగ్స్‌ను రూపొందించి సృజనాత్మకతకు పదును పెడితే డిజిటల్‌ ప్రపంచంలో దూసుకువెళ్చచ్చు. అమెచ్యూర్ల నుండి వీడియో క్లిప్లింగ్స్‌ను ఆహ్వానించే రివెర్‌.కామ్‌ ఏమంటున్నదో చూద్దాం...' రివెర్‌ను యూజ్‌ చేయడం చాలా ఈజీ. ఆన్‌లైన్‌ వీడియోను మార్కెట్‌ చేయడం ప్రారంభించిన ఒక్క ఏడాదిలోనే వీక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తోంది' అని వెబ్‌సైట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏంజెలా యట్‌వాన్‌ అంటున్నారు.
గతంలో అమెచ్యూర్‌ వీడియోగ్రాఫర్లు ఊహించని రీతిలో వారి సృజనాత్మకతకు తగిన ప్రతిఫలాన్ని, గుర్తింపును వారు అందుకుంటున్నారని ఆమె చెప్పారు. 2005లో ప్రారంభమైన రివెర్‌ వీడియోల కోసం తొలిసారిగా రెవిన్యూ షేరింగ్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆన్‌లైన్‌ వీడియో రంగానికి ఈ వెబ్‌సైట్‌ నాంది పలికింది. వీడియో ప్లే అనంతరం వచ్చే స్టిల్‌ ఇమేజెస్‌ నుండే కంపెనీకి ప్రధానంగా ఆదాయం సమకూరుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీడియో క్లిప్‌కు ముందుగా టెలివిజన్‌ ప్రకటనల తరహాలో ఈ వెబ్‌సైట్‌ వీడియో కమర్షియల్స్‌ను ప్రవేశపెట్టి నూతన టెక్నాలజీతో పాటు ఆదాయ వనరులకూ తెరతీసింది. నిషేధిత లేదా అసభ్య, అశ్లీల కంటెంట్‌ మినహా అన్ని వీడియో ప్లేలను రివెర్‌ స్వాగతిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ వెబ్‌సైట్లు కూడా వీడియో కంటెంట్‌ను ప్రదర్శించడం ద్వారా వచ్చే రాబడిని పంచుకుంటాయి. అయితే దీంతో ఇంటర్‌నెట్‌లో ఎక్కడైనా సదరు వీడియో దర్శనమివ్వచ్చు. అయితే హోస్టింగ్‌ వెబ్‌సైట్‌ మాత్రమే దీని బ్రాండ్‌ను, పర్యవేక్షణను కలిగిఉంటుంది. వివిధ వెబ్‌సైట్ల మధ్య ఈ తరహా రెవిన్యూషేరింగ్‌ ద్వారా వీడియోగ్రాఫర్లకు పెద్దఎత్తున రాబడి సమకూరడంతో పాటు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. లాస్‌ఏంజెల్స్‌కు చెందిన పండాస్మాష్‌.కామ్‌ వినూత్న ప్రోగ్రామ్‌లతో మంచి గుర్తింపు సాధించింది. వినోదంతో కూడిన స్కిట్స్‌ రూపకల్పనలో ఇది ముందుంది. కంపెనీ డెవలప్‌ చేసిన 'మారియో కార్ట్‌' గేమ్‌ రియల్‌లైఫ్‌ వెర్షన్‌ విశేషాదరణ చూరగొంది. ఇందులో పాల్గన్న కళాకారులు తమ మిమిక్రీతో వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటారు. ఈ వీడియోను ఫన్నీయోర్డి వంటి పలు విభిన్న వెబ్‌సైట్స్‌లో పొందుపరిచినట్లు పండాస్మాష్‌ కో ఫౌండర్‌ శామ్‌ గ్రీన్‌స్పాన్‌ చెబుతున్నారు.
గ్రీన్‌స్పాన్‌ ఆయన సహచరులు తమ ఆపరేషన్‌కు రివెర్‌.కామ్‌ సరైన ప్లాట్‌ఫాం అని చెబుతారు. ఆకర్షణీయ రెవిన్యూ షేరింగ్‌ను అందుకోవడమే కాకుండా వెబ్‌ హోస్టింగ్‌కు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకపోవడమే ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకతగా గ్రీన్‌స్పాన్‌ బృందం భావిస్తోంది. అలాగే రివెర్‌ ఇప్పటికే తెచ్చుకున్న బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా తమకు ఉపకరిస్తుందని వారంటున్నారు. రివెర్‌ను పలు ఔత్సాహిక వీడియోగ్రాఫర్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు ఆర్జించేందుకు తొలిమెట్టుగా పరిగణిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో ఈ వెబ్‌సైట్ల మనుగడ, అవి అందించే రెవిన్యూ షేరింగ్‌ మోడల్‌పై బిజినెస్‌ ప్రొఫెషనల్స్‌ పెదవివిరుస్తున్నారు. అరకొర లాభాలు, పేలవమైన క్వాలిటీ కంట్రోల్‌ ప్రమాణాలు, సాంకేతిక సవాళ్లు ప్రధాన అవరోధాలని వారంటున్నారు. ఫలితంగా ప్రకటనకర్తలూ ఆన్‌లైన్‌లో తమ ప్రకటనలను ఉంచేందుకు విముఖత చూపుతారని వీరు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికి తోడు టెలివిజన్‌, రేడియోతో పోలిస్తే ఈ నూతన వినోద మాధ్యమం ప్రకటనల రేట్లు చాలా తక్కువగా ఉండటం మరో ప్రతికూల అంశమని అంటున్నారు.
ఏదేమైనా ఆన్‌లైన్‌ వీడియో వృద్ధి చెందాలంటే కంటెంట్‌లో, వీడియో క్లిప్పింగ్స్‌లో మరింత సృజనాత్మకత ఇనుమడించాలని, ముఖ్యంగా టెక్నలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌ చోటుచేసుకోవాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్న ఆన్‌లైన్‌ వీడియోకు క్రమంగా ఆదరణ పెరుగుతున్నదని, నెమ్మదిగా ఊపందుకుంటున్నదని రివెర్‌.కామ్‌ అంటోంది. అన్ని సవాళ్లను అధిగమిస్తుందని దృఢంగా చెబుతోంది. త్వరలోనే ఆన్‌లైన్‌ వీడియో తన మార్కెట్‌ను పెంచుకుని నూతన వినోద మాధ్యమంగా అందరినీ అలరిస్తుందని రివెర్‌ చెబుతోంది. కంటెంట్‌ మెరుగుపరుచుకని, కొత్తదనంతో వస్తే ఔత్సాహిక వీడియోగ్రాఫర్లను నేటి సైబర్‌యుగం స్వాగతిస్తోంది. మరి మన వీడియోగ్రాఫర్లూ ఈ నూతన మోడల్‌ను అందిపుచ్చుకునేందుకు రెడీ కావాలి.

Thursday, October 11, 2012

బిఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో 4జి


భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టులో 4జి (నాలుగో తరం టెలికామ్‌ సేవలు) సంబంధించిన గ్లోబల్‌ టెండర్‌లను పిలవనున్నట్లు తెలిపింది. ఇవి 3జి (మూడోతరం టెలికామ్‌ కన్నా అత్యాధునికమైనవి) తర్వాత తరానికి చెందినవి. వీటిని వినియోగించటం ద్వారా తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్‌ నుంచి భారీపరిమాణంలో ఉన్నటువంటి ఫైళ్లను డౌన్‌లోడింగ్‌ చేసుకోవచ్చు. వేగంగా ప్రయాణిస్తూ ఇంటర్నెట్‌ను సులభంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు

Wednesday, October 10, 2012

వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు


వెబ్‌సైట్‌ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అయితే వెబ్‌సైట్‌ను పెట్టుకోవాలంటే ముందుగా- సైట్‌ను పెట్టుకొనేందుకు అవసరమైన స్పేస్‌ (కనీసం 100ఎంబి నుండి ఆ పైన)ను స్పేస్‌ ప్రొవైడర్స్‌ వద్ద కొనుగోలు చేయాల్సి వుంటుంది. దాంతోపాటు డైమైన్‌ రిజిస్ట్రేషన్‌ కూడా వారి వద్దనే చేయించుకోవచ్చు. అంటే మీరు ఏ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్మించాలనుకొంటున్నారో దాన్నే డైమైన్‌ అంటారు. ఈ రెండింటికీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన రేటును తీసుకుంటుంటారు. మీరు ఎవనైనా స్పేస్‌ ప్రొవైడర్‌ను కలిస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు ఆ సైట్‌లో వుంచే కంటెంట్‌ను బట్టి సైట్‌ డిజైన్‌కు అదనంగా ఖర్చవుతుంది. పూర్తిగా డిజైన్‌ అయిన సైట్‌ను గూగుల్‌ యాడ్‌సెన్స్‌ అప్రూవల్‌కు పంపాలి. వారు మీ సైట్‌ను ఓకే చేస్తే, ఆ సైట్‌కు సంబంధించిన యాడ్స్‌ను వారు ప్రొవైడ్‌ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు మెయిల్‌ చేస్తారు. అయితే ఆ వెబ్‌సైట్‌ ఇంగ్లీష్‌లో వుంటేనే వారు అంగీకరిస్తారు.

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌) అంట్లాటిస్‌ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఉపగ్రహం ద్వారా తీసిన ఛాయా చిత్రమని నాసా స్పేస్‌ ఆపరేషన్స్‌ చీఫ్‌ బిల్‌ గెరెస్టిమెరియర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో స్పేస్‌ సెంటర్‌ నిర్మాణం 2012 నాటికి పూర్తవుతుందని తెలిపారు.

Tuesday, October 9, 2012

ఎనిమిది వేల రూపాయలకు చైనాలో కంప్యూటర్లు

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన లినోవా గ్రూప్‌ అతి తక్కువకే 199 డాలర్లుకు (సుమారు ఎనిమిది వేల రూపాయలకు) చైనాలోని గ్రామీణ ప్రాంతాల వారికి కంప్యూటర్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఒక రకంగా ప్రపంచ కంప్యూటర్‌ తయారీ సంస్థల్లో సంచలనాన్ని కలగజేస్తోంది. ఎందువల్ల అంటే.. ఓ పక్కన ఐఓసిఎల్‌ 100డాలర్ల ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చి తక్కువకే ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నటువంటి సమయంలో అమెరికాలో అగ్రశేణి కంపెనీ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీనివల్ల భవిష్యత్‌లో చెప్పుకోదగిన స్థాయిలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలో మార్పులు జరగవొచ్చునని అందరూ భావిస్తున్నారు. దీనిపై లినోవా చైనా ప్రతినిధి మాట్లాడుతూ-ఇది టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించాడు. త్వరలో బీజింగ్‌లో జరగనున్న ఒలంపిక్‌ క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని నెట్‌లో వీక్షించాలనుకునే దేశప్రజలకు ఇంత తక్కువ ధరలో కంప్యూటర్స్‌ లభించటం ద్వారా వారు ఒలంపిక్‌ క్రీడలను ఆస్వాదిస్తారు అని తెలిపారు. కంపెనీ ప్రధానంగా రైతులను, ఇతర విద్యార్థి వర్గాలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపింది.

Sunday, October 7, 2012

నోకియా, మోటోరోలా బ్యాటరీలు ఫెయిల్యూర్‌..


ప్రముఖ అగ్రగామి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలైన నోకియా, మోటోరోలాకు చెందిన బ్యాటరీలు తాజాగా నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఫెయిల్యూర్‌అయ్యాయని అమెరికాకు చెందిన వార్తా పత్రిక ఒకటి వెల్లడించింది. గతంలో బ్యాటరీలు పేలటానికి సెల్‌ఫోన్‌ వినియోగదారుడి నిర్వహణా లోపంగా కంపెనీలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం ఈ వార్తా కథనం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ బ్యాటరీలు పేలి ప్రమాదం సృష్టించే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. ఇంటర్నెషనల్‌ హెర్లాక్ట్‌ టర్బెన్‌చే దక్షిణ గువాంగ్‌డంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం చైనీస్‌ రెగ్యులేటర్స్‌ వారు పరీక్షలను నిర్వహించి ఈ విషయాన్ని తెలియజేసినట్లు పత్రిక పేర్కొంది. దీనిపై మోటోరోలా కంపెనీ ప్రతినిధి యాంగ్‌ బోనింగ్‌ బీజింగ్‌లో మాట్లాడుతూ- చైనాలో పరీక్షలు నిర్వహించిన బ్యాటరీలు తమ కంపెనీకి చెందినవి కాదని పేర్కొన్నారు. తమ ఒరిజనల్‌ బ్యాటరీలను మార్కెట్‌ నుంచి సేకరించకుండా, డూప్లికేట్‌ బ్యాటరీల ద్వారా పరీక్షించారని, తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. నోకియా సైతం ఇదే విధమైన ప్రకటనను జారీ చేసింది. అంతేగాక నోకియా చైనాలో ఎటువంటి బ్యాటరీలు తయారు చేయటం లేదని తెలిపింది.

Popular Posts